వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు రావడం సహజం. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. వేడి నీటిలో కొన్ని తులసి ఆకులు లేదా యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గి, శ్వాస సులభంగా ఆడుతుంది. ఇది జలుబు, గొంతు నొప్పిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.

పసుపులో యాంటీ-వైరల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం రసంలో తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల గొంతులోని శ్లేష్మం తగ్గి, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. సూప్‌లు, హెర్బల్ టీలు, చికెన్ సూప్ వంటి వేడి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల గొంతులోని మంట తగ్గి, శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఈ చిట్కాలు జలుబు, దగ్గు సమస్యలకు త్వరగా ఉపశమనం కలిగించినప్పటికీ, సమస్య తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. దగ్గు, జలుబు సమస్యలు చిన్నపిల్లల్లో కనిపిస్తే వాళ్ళ హెల్త్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  పిల్లల విషయంలో ఎంత తక్కువగా కేర్ తీసుకుంటే వాళ్లకు అన్ని కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: