
వేళ్ళ నొప్పులను తగ్గించడంలో మసాజ్ అద్భుతంగా పని చేస్తుంది. ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను గోరు వెచ్చగా చేసి, వేళ్ళకు నెమ్మదిగా మసాజ్ చేయండి. వేళ్ళతో పాటు, అరచేతిని, మణికట్టును కూడా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. రోజులో కొన్ని గంటల పాటు చేతులకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కంప్యూటర్‌లో ఎక్కువ సమయం పనిచేసేవారు, చేతులతో ఎక్కువ పని చేసేవారు ప్రతి గంటకు ఐదు నిమిషాలు వేళ్ళకు విశ్రాంతి ఇవ్వడం మంచిది.
మీరు కనుక చేతికి గాయం అవ్వడం వల్ల నొప్పులు వస్తే, ఆ ప్రదేశంలో చల్లని నీటితో కాపడం పెట్టండి. ఐస్ ప్యాక్‌తో ఐదు నుంచి పది నిమిషాల పాటు కాపడం పెట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. క్యాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. పాల ఉత్పత్తులు, పప్పులు, కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోండి.
ఈ చిట్కాలను పాటించడం వల్ల చేతి వేళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే, నొప్పులు తగ్గకపోతే, వైద్యులను సంప్రదించడం మంచిది. చేతి వేళ్ళ నొప్పి వల్ల కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. చేతి వేళ్ళ నొప్పుల వల్ల కొంతమేర నష్టం కలుగుతుంది. చేతి వేళ్ళ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏ మాత్రం మంచిది కాదు.