నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరియు పెరిగిపోతున్న ఒత్తిడి కారణంగా చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కిడ్నీలు ప్రమాదంలో పడినప్పుడు శరీరం కొన్ని ముందస్తు సంకేతాలను ఇస్తుంది. వీటిని గమనించి ప్రాథమిక దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు.
ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరిపడా నీరు తాగడం అత్యంత అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం వల్ల కిడ్నీలలో పేరుకుపోయిన విషతుల్యాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఆహార విషయంలో కూడా కొన్ని మార్పులు తప్పనిసరి. ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ఆహారంలో సోడియం శాతం పెరిగితే అది రక్తపోటుకు దారితీస్తుంది, ఇది నేరుగా కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అలాగే అధికంగా ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది, కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది.
పండ్లు, కూరగాయలు కిడ్నీలకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సిట్రస్ జాతి పండ్లు, యాపిల్స్ మరియు క్యాలీఫ్లవర్ వంటివి కిడ్నీల శుద్ధికి తోడ్పడతాయి. అధిక బరువు కూడా కిడ్నీ సమస్యలకు ఒక ప్రధాన కారణం, కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు (BP) మరియు మధుమేహం (Diabetes) ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు సమస్యలు నియంత్రణలో లేకపోతే కిడ్నీలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. తరచూ పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు) వాడటం కూడా కిడ్నీలకు శాపంగా మారుతుంది, కాబట్టి వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు. కిడ్నీ సమస్యలతో బాధ పడేవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి