అయితే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన నియోజకవర్గాల్లో మదనపల్లె కూడా ఒకటి. 2014లో ఇక్కడ నుంచి దేశాయి తిప్పారెడ్డి వైఎస్సార్‌సీపీ నుంచి గెలిస్తే, 2019 ఎన్నికల్లో మహమ్మద్ నవాజ్ బాషా విజయం సాధించారు. మదనపల్లె నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన బాషా..టీడీపీ అభ్యర్ధి దొమ్మలపాటి రమేష్‌పై 27 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచాక బాషా...ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందున్నారు. ఇంకా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్తగా సిసి రోడ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చేపడుతున్నారు. అటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నాడు-నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇక కరోనాపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకునేందుకు తరచూ మున్సిపల్, సచివాలయ ఉద్యోగులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజాబాగోగులు గురించి ఆలోచిస్తున్నారు. అలాగే కార్యకర్తలకు అండగా ఉంటూ, పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు.
ఇదే సమయంలో టీడీపీ నేత దొమ్మలపాటి రమేష్ కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. తాజాగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్ధతుగా ఆందోళనలు చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ...వచ్చే ఎన్నికల్లో మదనపల్లె టీడీపీ జెండాని ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి