ఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ ప్రభావం ఎక్కువగానే ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే...ఆ ఫ్యామిలీకు ఉన్న అభిమానులే రాజకీయాల్లో కీలకంగా మారతారు. అలాగే ఆ ఫ్యామిలీ ద్వారానే చాలామంది నాయకులు వెలుగులోకి వచ్చి సక్సెస్ కూడా అయ్యారు. అలా వచ్చిన వారిలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఒకరు...వెల్లంపల్లి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో కలవడంతో...కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు.

ఇక 2014 ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చి...మళ్ళీ వెస్ట్ నుంచి పోటీ చేశారు..అప్పుడు టీడీపీతో పొత్తు ఉన్న విషయం తెలిసిందే. అలాగే పవన్ కల్యాణ్ సపోర్ట్ ఉంది. కానీ వెల్లంపల్లి 3 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. 2019 ఎన్నికలోచ్చేసరికి వెల్లంపల్లి వైసీపీలోకి వెళ్ళి...అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే పరోక్షంగా వెల్లంపల్లి గెలుపుకు పవన్ ఉపయోగపడ్డారనే చెప్పొచ్చు. వెస్ట్‌లో జనసేన ఓట్లు చీల్చేసింది. వెల్లంపల్లికి టీడీపీపై 7 వేల ఓట్ల మెజారిటీ వస్తే...జనసేనకు 22 వేల ఓట్లు వచ్చాయి. అంటే జనసేన ఎలా కలిసొచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

సరే ఏదైతే ఏముంది వెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా జగన్ క్యాబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇక ఏపీలో ఎక్కువ విమర్శలు ఎదురుకున్న శాఖ ఇదే...గత రెండున్నర ఏళ్లలో ఆలయాలపై దాడులు, ఆలయాల్లో క్రైస్తవ మత ప్రచారాలు పెరిగాయనే ఆరోపణలు వచ్చాయి.

అదేవిధంగా దేవాదాయ శాఖలో అవినీతి కూడా ఎక్కువే అని ఆరోపణలు లెక్కలేని విధంగా వచ్చాయి. అసలు వెల్లంపల్లి అక్రమాలకు లెక్కలేదని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించాయి. ఈ ఆరోపణలని పక్కనబెడితే..మంత్రిగా వెల్లంపల్లి సక్సెస్ అయింది తక్కువే అని తెలుస్తోంది. ఇక ఎక్కడకైనా ఆలయాలకు వెళ్లినప్పుడు...వాటికి సంబంధించి తప్ప రాజకీయ పరమైన విమర్శలు చేయడంలోనే ముందుంటారు. అలాగే దేవాలయాల్లో అభివృద్ధి శూన్యమే.

ఎమ్మెల్యేగా చూస్తే విజయవాడ వెస్ట్‌లో రెండున్నర ఏళ్లలో గొప్ప మార్పులు, గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగలేదని తెలుస్తోంది. ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ, చిన్నాచితక అభివృద్ధి కార్యక్రమాలు మామూలే. ఇటు రాజకీయంగా చూస్తే వెల్లంపల్లి బలం తగ్గుతున్నట్లు తెలుస్తోంది....నెక్స్ట్ గానీ టీడీపీతో జనసేన కలిస్తే వెల్లంపల్లికి మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువే.
   


మరింత సమాచారం తెలుసుకోండి: