మనకు నిత్యవసర సరుకులలో పాలు అనేది ఎన్నో ఏళ్లుగా వస్తూనే ఉంది.. అయితే గతంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఒక పాడి ఉండేది.. కానీ మారుతున్న కాలం ప్రకారం అందరూ ఎక్కువగా పాల ప్యాకెట్లను ఉపయోగిస్తున్నారు.. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాలు పై ఒక నిర్ణయాన్ని తీసుకుంది. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.


ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు మరొకసారి  పెనుభారంగా మారనుంది.. అదేమిటంటే పాల ధరలను మరొకసారి పెంచబడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. విజయ డైరీ పాల సేకరణ ధర పెంచుతున్నామని విజయ డైరీ చైర్మన్ భూమా రెడ్డి  తో పాటు, రాష్ట్ర పశు శాఖ చీఫ్ సెక్రటేరియల్ ఆధర్ సిన్హా నిన్నటి రోజున తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ లో నిన్న విజయ డైరీ ప్రధాన కార్యాలయం నందు ఈ విషయాన్ని చర్చించుకుని తెలియజేశారట. అయితే ఇప్పుడు ఉన్న పాల సేకరణకు ధర కంటే ఎక్కువగా లీటర్ మీద 4 రూపాయలు పెంచాలని ఆధర్ సిన్హా ను డైరీ చైర్మన్ భూమారెడ్డి కోరినట్లు సమాచారం.. కానీ ప్రభుత్వం మాత్రం రెండు రూపాయలను పెంచుతున్నట్లు గా సమాచారం. అయితే ఈ నాలుగు రూపాయల విషయాన్ని కూడా త్వరలోనే పరిశీలించి తెలియజేస్తానని ఆధర్ సిన్హా తెలియజేశారట.


ముఖ్యంగా ఈ కొత్త ధరలు ఈరోజు నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నదట.. అయితే 2 రూపాయలను పెంచుతారా..4 రూపాయల పెంచుతారా అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం బర్రె పాలు లీటర్ కి 40 నుంచి 45 రూపాయలు మధ్య రైతులకు చెల్లించడం జరుగుతోందట.. ఇక ఆవుపాలు 28 రూపాయల వరకు చెల్లిస్తున్నారట.. అయితే ఈ పాడి రైతులకు మాత్రం ఈ ధరలు సరిపోకపోవడంతో ప్రస్తుతం 6% ఫ్యాట్ ఉన్న గేదె పాల పై 55 రూపాయలు..3% ఫ్యాట్ ఉన్న ఆవు పాల పై లీటర్ కి 35 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: