ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అటు స్కూల్ పిల్లలకు ఇటు కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందివ్వడమే కాకుండా వారికి కావలసిన అన్ని సౌకర్యాలను అందించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.. ఇప్పటికే గత రెండు సంవత్సరాలుగా చిన్నపిల్లలకు అమ్మఒడి,  విద్యార్థులకు విద్యా దీవెన పథకం కింద డబ్బులను వారి ఖాతాలో నేరుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న అమ్మఒడి కింద తల్లుల ఖాతాలో డబ్బు జమ చేసిన జగనన్న ప్రభుత్వం నేడు విద్యా దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఆయన విద్యా దీవెనకు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించబోతున్నారు. అంతేకాదు ఈ బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా జిల్లా అధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  నాగార్జున,  డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి,  రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ,  జిల్లా కలెక్టర్ విజయకృష్ణ , పోలీస్ సూపర్డెంట్ వకుల్ జిందాల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను మరింత పగడ్బందీగా చేయాలని అధికారులకు సూచించడం జరిగింది.

ఇకపోతే జగనన్న విద్యా దీవెన పథకం కింద వైఎస్ జగన్ నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇది మూడవసారి కావడం గమనార్హం. ఇక రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులందరికీ ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకమే ఇది అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తో పాటు ఇంజనీరింగ్ , మెడిసిన్ తదితర కోర్సులకు కూడా ఈ విద్యా దీవెన పథకం వర్తిస్తుంది. ఆయా కోర్సులను చదివే పేద విద్యార్థులు తమ కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. రేపు విద్యార్థులకు డబ్బులు ఇవ్వనున్నారు. ఐటీ విద్యార్థులకు రూ.10,000, డిప్లమా విద్యార్థులకు రూ. 15000, డిగ్రీ ,ఇంజనీరింగ్ ,మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: