ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ సామాన్య ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే స్కీములను కూడా ప్రవేశపెట్టింది. ఇక పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం కూడా ఒకటి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు కూడా ఏక రీతి నెలవారి ఆదాయాన్ని పొందడానికి ఉపయోగించుకోవచ్చు అని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ లో మైనర్ కూడా ఈ పథకంలో చేరవచ్చు. అలాగే ఇద్దరూ కూడా సంయుక్తంగా చేరే అవకాశం ఉంటుంది.


ప్రస్తుతం ఈ పథకంలో మీకు 6.8% వడ్డీ లభిస్తోంది. ఇక మీరు ప్రతిరోజు రూ.1000 చొప్పున ఈ పథకంలో పొదుపు చేస్తే మీ పెట్టుబడి ఐదేళ్లలో రూ.13.89 లక్షలకు చేరుకుంటుంది. ఇక మీరు ఇందులో రూ.1.5 లక్షల పెట్టుబడి వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద ఆదాయపు పన్ను మినహా లభిస్తుంది. ఇకపోతే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం మీద మెచ్యూరిటీ అయిన తర్వాతనే వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. ఇక నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ముందుగా తీసుకోవాలంటే మీరు పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించాల్సి ఉంటుంది.


నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అనేది మీకు పెన్షన్ రూపంలో కూడా డబ్బులను అందిస్తుంది అని చెప్పవచ్చు. తక్కువ కాలంలో ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికి ఈ పథకం మంచి ఆదాయాన్ని అందిస్తుంది. ఇక వీటితో పాటు సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా మంచి ఆదాయాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. ఇక అలాగే నేషనల్ పెన్షన్ స్కీం కూడా మంచి ఆదాయాన్ని అందిస్తుంది. ఇక పోస్ట్ ఆఫీస్ లో మీకు తగినన పథకాన్ని ఎంచుకొని డబ్బులను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: