ఈ సంవత్సరం తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 ఎంతో హంగామా చేసిందో అందరికీ తెలిసిందే.  ఈసారి బిగ్ బాస్ లోకి 17 మంది కంటిస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా..వీక్ ఎండ్ లో నాని చేస్తున్న హంగామాతో కాస్త రిలీఫ్ వచ్చింది.  అయితే బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ కి సపోర్ట్ గా బయట కౌశల్ ఆర్మీ ఒకటి ఏర్పడటం..ఎలిమినేషన్ లో వారు జోక్యం చేసుకుంటున్నారని వార్తలు రావడం ఇలా ఎన్నో ట్విసటుల మద్య బిగ్ బాస్ సీజన్ 2 పూర్తయ్యింది.  ఈసారి బిగ్ బాస్ 2 విన్నర్ గా కౌశల్ గెలిచారు.   
Image result for big boss 2 telugu winner
అయితే కౌశల్ కి బయట ఎంత ఫాలోయింగ్ ఉందో బిగ్ బాస్ హౌజ్ సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా రెస్పాన్స్ అవుతున్నారు.  కొంత మంది నెగిటీవ్ గా..మరికొంత మంది పాజిటీవ్ గా రెస్పాన్స్ అవుతున్నారు.    బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన కౌశల్ పై గీతామాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టైటిల్ విజేతగా నిలిచిన తరువాత హౌస్ మేట్స్ ఎవరూ కూడా తనను అభినందించలేదని కౌశల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాంటి వారితో స్నేహం చేయాలనుకోవడం తన పొరపాటని వారితో ఎప్పటికీ కాంటాక్ట్ ఉండనని అన్నారు. 
Image result for big boss 2 telugu winner
తాజాగా ఈ విషయంపై గీతామాధురి స్పిందించారు..కౌశల్ ని ప్రత్యేకంగా విష్ చేయాలని అతడికి ఫోన్ చేస్తే స్పందించలేదు. అతడి భార్య నీలిమ నాకు రెస్పాండ్ అయ్యారు. భానుశ్రీ పుట్టినరోజు నాడు కూడా ఆయన్ని రమ్మని పిలవడానికి ప్రయత్నిస్తే ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే..బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారునని అన్నారు. కౌశల్ హౌస్ లో ఎలా ఉండేవారో బయట కూడా మాతో అలానే ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను ఆయనకి ఫోన్ చేసినట్లు స్క్రీన్ షాట్స్ తీసి చూపించాలా..?'' అంటూ ప్రశ్నించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: