అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా భారతీయ సినిమా రంగంలోని సంచలనం సృష్టించింది. కమలహాసన్ శంకర్ కలయికలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Image result for shankar

ఈ క్రమంలో తాజాగా శంకర్ భారతీయుడు పార్ట్2 తీయడానికి రెడీ అయిన నేపద్యంలో ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు తమిళ యువ నటుడు శింబు కూడా నటిస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శంకర్...రజనీకాంత్ సినిమా అయినా  రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు..ఈ నేపథ్యంలో త్వరలో భారతీయుడు 2 మొదలవుతున్న నేపద్యంలో శింబు ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడట.

Image result for shimbu

కెరీర్ ప్రారంభించిన అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన శింబు, సోలో హీరోగానే నటిస్తూ వచ్చాడు. మొన్నటిదాకా వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచిన శింబు ఈ మధ్య బుద్దిగా సినిమాలు చేసుకుంటున్నాడు.

Image result for simbu kamal hassan

ఇగోలు పక్కన పెట్టి, ఇతర హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నాడు. మణిరత్నం సినిమా “చెక్కి చివంత వానం” లో ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో శంకర్ అతనిని భారతీయుడు2 కోసం ఎంపిక చేసాడట. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో శింబు కనిపించనున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: