టివి నటిగా పేరు తెచ్చుకున్న మౌనిరాయ్ తరువాత రోజుల్లో దారుణంగా మారిపోయింది.  సినిమా పరిశ్రమలో అవకాశాలు వస్తున్నాయి.  మంచి అందం కూడా ఉంది.  ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలియదు.  సడెన్ గా అందాన్నికావాలని మార్చేసుకుంటారు.  ఇంకేదో కావాలని అనుకోని ఇంకేదో చేసేస్తారు.  ఫలితం చాలా దారుణంగా విచిత్రంగా మారిపోతుంది.  


సహజమైన అందాన్ని కోల్పోయి విచిత్రంగా మారిపోతారు.  కృత్రిమ అందం ముఖానికి వన్నె తెస్తుంది అనుకుంటే.. ఎబ్బెట్టుగా మారిపోతుంది.  ఇప్పుడు మౌని రాయ్ విషయంలోనూ అదే జరిగింది.  ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని సహజమైన అందాన్ని పోగొట్టుకుంది.  ఫలితం ఇదుగో ఇలా మారిపోయింది.  


మౌనిరాయ్ తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు పలు సర్జరీలు చేయించుకున్న అనంతరం ఓ ఈవెంట్లో ఆమెను చుసిన జనాలు చూసి షాక్ ఐయ్యారట. సహజ సౌందర్యంతో గతంలో ఏంజల్ లా కనిపించిన మౌనిరాయ్ ముఖంలోని మెరుపు ప్లాస్టిక్ సర్జరీ కారణంగా నాశనమైందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 


మౌని రాయ్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి.  మేడ్ ఇన్ చైనా, బ్రహ్మాస్త్ర, మొఘల్ చిత్రాలు చేస్తోంది.  ఇలా సినిమాలు చేస్తున్నా ఎందుకని అలా మారిపోవాలని అనుకుందో అర్ధంకాని ప్రశ్న.  ఏదైతేనేం.. మారిపోయింది.  అందరి చేత పాపం చివాట్లు తిన్నది.   


మరింత సమాచారం తెలుసుకోండి: