బాలీవుడ్ లో ఎంతో మంది హాట్ బ్యూటీలు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  అందం ఉంది, ఆకట్టుకునే ఫిగర్‌ ఉంది. ఎక్స్‌పోజింగ్‌కి అస్సలు మొహమాటాల్లేవ్‌. కానీ ఏం ఈ బ్యూటీకి ఏమాత్రం కలిసి రావడం లేదు.  'హేట్‌ స్టోరీ 4'లో హాట్‌ హాట్‌ అందాలతో రెచ్చిపోయి, కుర్రకారు మతులు పోగొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతెల్లా గురించి మనం చర్చించుకుం టున్నాం.  లేటెస్ట్‌గా ఈ బ్యూటీ తన అందాలకు టాలీవుడ్‌లో పదును పెట్టాలని అనుకుంటోందట. గోపించద్ నటిస్తున్న ‘సీటీమార్’ లో చోటు దక్కించుకుంది. 

 

 బ్యూటీ తన అందాలకు టాలీవుడ్‌లో పదును పెట్టాలని అనుకుంటోందట. ఇప్పటికే ఓ యంగ్‌ హీరో సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయనీ టాక్ వినిపించింది.   ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.. అందరు సెలబ్రెటీలు ఇంటిపట్టున ఉంటున్నారు.  ఈ సమయంలో ఈ బ్యూటీకి కష్టాలు వచ్చిపడ్డాయి. ఊర్వ‌శీ రౌతెల్లా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విష‌యాన్ని ఊర్వ‌శీ త‌న  సోషల్ మాద్యం ద్వారా పేర్కొంది. ఫేస్ బుక్ లో  ఏ పోస్ట్‌కి రియాక్ట్ కావొద్ద‌ని నెటిజ‌న్స్‌కి స్ప‌ష్టం చేసింది.

 

ఇప్ప‌టికే త‌న విజ్ఞ‌ప్తిని ముంబై పోలీసుల‌కి తెలియ‌జేయ‌గా, వారు ఈ విష‌యాన్ని సైబ‌ర్ పోలీసుల దృష్టికి తీసుకెళ‌తామ‌న్నారు.  హ్యాక‌ర్స్ త‌న‌ని భారీ మొత్తంలో డ‌బ్బు అడుగుతున్నారని ఊర్వ‌శీ   చేసింది. తెలుగులోను ప‌లు సినిమాలు చేసిన ఊర్వశీ .. సీటీమార్ అనే మూవీలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంది.  దయచేసి తన ఫేస్ బుక్ కి ఎవరూ రియాక్ట్ కావొద్దని అంటుంది ఈ బ్యూటీ.  గత కొంత కాలంగా సెలబ్రెటీలకు సంబంధించిన సోషల్ అకౌంట్ హ్యాక్ చేయించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.   తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఫేస్ బుక్ హ్యాక్ చేయడం పై టెన్షన్ మొదలైంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: