సినిమాల్లో యాక్షన్ తరహా కధాంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. యాక్షన్ సినిమాల్లో పోలిస్, మిలిటరీ నేపథ్యం ప్రేక్షకులను అటెన్షన్ కు గురి చేస్తాయి. తీవ్రవాదం, ఉగ్రవాదం బ్యాక్ డ్రాప్ సినిమాల్లో ఉండే ఎత్తుకుపై ఎత్తులు, గన్ కల్చర్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. అడివి శేష్ గూఢచారి సినిమా ఈ తరహాలోకే వస్తుంది. ప్రస్తుతం ఇటువంటి నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ లో అక్కినేని వారి ఇంటి కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత నటించింది. ఆమె పాత్రలో నెగటివ్ ఛాయలు ఉంటాయని తెలుస్తోంది.

IHG

 

రాజ్ అండి డీకె దర్శకత్వంలో పాకిస్థాన్ టెర్రరిజం నేపథ్యంగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ తెరకెక్కుతోంది. ‘ఫ్యామిలీ మేన్ 2’ పేరుతో ఈ వెబ్ సిరీస్ నిర్మితమవుతోంది. ఈ సీక్వెల్ లో సమంత నటిస్తోంది. ఇందులో ఆమె స్లీపర్ సెల్ తరహా పాత్ర చేస్తోందని అంటున్నారు. తీవ్రవాదుల కోసం పని చేసే పాత్రలో సమంత నెగటివ్ ఛాయలున్న పాత్రలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే సమంతకు ఇది కొత్త తరహా పాత్ర అని చెప్పాలి.

IHG's risqué lace bustier dress for your ...

 

ఇప్పటి వరకూ చలాకీ పాత్రల్లో నటించిన సమంతకు ఇది సీరియస్ రోల్ అని చెప్పాలి. మ‌నోజ్ బాజ్‌పాయ్‌, ప్రియ‌మ‌ణి, కిషోర్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. చాలా సహజసిద్ధంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారంటూ దర్శక ద్వయానికి మంచి పేరు వచ్చింది. దీంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ ఫ్యామిలీ మేన్ 2ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొత్త సినిమాల కోసం చూస్తున్న వారికి ఈ హిట్ సీక్వెల్ ఏమేరకు అలరిస్తుందో చూడాలి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: