ఈ మధ్య మన టాలీవుడ్ హీరోయిన్స్ అంతా మాల్దీవ్స్ బాట పట్టారు. ఎప్పుడూ హాలిడే వెకేషన్  కోసం అమెరికా.. పారిస్ లాంటి చోట్లకు వెళ్లే మన హీరోయిన్స్ మాల్దీవ్స్‌ బాట పట్టారు. ఏ హీరోయిన్ ఇన్‌స్టా ఓపెన్‌ చేసినా.. మాల్దీవ్స్ ఫోటోలు వీడియోలే దర్సనం ఇస్తున్నాయి. దానికి కారణం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా ?. అయితే దానికి కారణం ఉందండోయ్, లవర్స్‌.. ఫ్యామిలీ .. సోలోగా ఎలా వెళ్లినా.. కావాల్సినంత ప్రైవసీ అక్కడ మాత్రమే దొరుకుతుందట. 1200 దీవుల సముదాయమైన ఈ మాల్దీవ్స్‌లో 25 దీవులను కేవలం టూరిజం కోసమె పక్కన పెట్టారట. 


ఆ అన్ని దీవుల్లో ఫైవ్‌ స్టార్‌ ఫెసిలిటీ వుంది. సెలబ్రిటీ స్‌ మాత్రమే కాదు సామాన్యులకు కూడా కావాల్సినంత భద్రత వుండడంతో మన హీరోయిన్స్ అందరూ చలో మాల్దీవ్స్‌ లో అంటున్నారు. అదీ కాక అసలు వీసా అనేదే లేకుండా 30 రోజులు గడిపే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది. సో ఇబ్బందులు ఏవీ లేకుండా డబ్బు పాస్ పోర్ట్ ఉంటే ప్రకృతి ప్రసాదించిన ఎన్నో అద్భుతాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. 


ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌ వేయాలనుకున్న రకుల్‌ ప్రస్తుతం మాల్దీవ్స్‌ విహరిస్తోంది. అమ్మానాన్న.. తమ్ముడుతో ఆమె కలిసి దిగిన ఫోటోలు… వీడియోలు షేర్ చేసింది. అంటే కాదు ఆమె బికినీలో రచ్చ కూడా చేస్తోంది.  ఇక మరో పక్క గౌతమ్‌ను పెళ్లి చేసుకున్న కాజల్‌.. హానీమూన్‌ స్పాట్‌గా మాల్దీవ్స్‌ను ఫిక్స్‌ చేసుకుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోలు షేర్‌ చేస్తూ..రచ్చ చేస్తోంది. ఇక తన భర్త పుట్టిన రోజు గడిపేందుకు సమంతా కూడా అక్కడికే వెళ్ళడం గమనార్హం. చూడాలి ఇంకా ఎంత మంది హీరోయిన్స్ మాల్దీవ్స్ బాట పడతారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: