ఇప్పటికీ యంగ్‌బాయ్‌లా కనిపించే దిల్‌ రాజుకు 50 ఏళ్లంటే నమ్మడం కష్టమే. 1970 డిసెంబర్‌ 18న నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలో పుట్టిన దిల్‌ రాజు అసలు పేరు వెంకట రమణా రెడ్డి. డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెసైన  రమణారెడ్డి...  'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌' స్థాపించి దిల్‌ సినిమాతో నిర్మాతగా మారాడు.  రాజుగా ఎంట్రీ ఇచ్చి.. డెబ్యూ మూవీ సూపర్‌హిట్‌ కావడంతో.. దిల్‌ రాజుగా పాపులర్‌ అయ్యాడు. తక్కువ టైంలో ఎక్కువమంది దర్శకులను పరిచయం చేసి స్టార్స్‌ను చేసిన బేనర్‌ ఇది.  

తెలుగు ఇండస్ట్రీలో స్టార్స్‌గా వెలుగుతున్న చాలామంది దర్శకులు... దిల్‌ రాజు ఫ్యాక్టరీ నుంచి వచ్చినవాళ్లే. ఆర్యతో  సుకుమార్‌ను.. భద్రతో బోయపాటిని.. బొమ్మరిల్లుతో భాస్కర్‌ను.. కొత్త బంగారులోకంతో శ్రీకాంత్‌ అడ్డాల... మున్నాతో వంశీ పైడిపల్లిని  పరిచయం చేశారు దిల్‌ రాజు. వంశీపైడిపల్లి  ఐదు సినిమాలు తీస్తే.. ఊపిరి తప్ప అన్నీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో తీసినవే. ప్రస్తుతం వకీల్‌సాబ్‌ దర్శకుడు వేణు శ్రీరామ్‌ను దిల్‌ రాజు 'ఓమై ఫ్రెండ్‌'తో ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ మూవీ ఫ్లాప్‌ అయినా.. ఎంసిఎ ఛాన్స్‌ ఇచ్చి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ని చేశాడు. మూడో సినిమా వకీల్‌సాబ్‌తో ఏఊకంగా పవన్‌ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ కొట్టేశాడు శ్రీరామ్‌.

దిల్‌రాజు స్టార్స్‌తో తీసినా.. కొత్తవాళ్లతో తీసినా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌ నుంచి సినిమా వస్తుందంటే.. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తారు. బొమ్మరిల్లు.. భద్ర.. బృందావనం..సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్లు వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు దిల్‌రాజు.

మహేశ్‌, వెంకటేశ్‌తో తీసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌ క్రేజ్‌ను మరింత పెంచింది. మర్చిపోయిన మల్టీస్టారర్‌ మూవీస్‌కు ఊపిరి పోసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రస్తుతం వకీల్‌సాబ్‌.. ఎఫ్‌3 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ తీస్తున్న దిల్‌రాజు  గత ఏడాది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. నాని నటించిన జెర్సీ మూవీని హిందీలో అల్లు అరవింద్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. అలాగే.. బోనీకపూర్‌తో కలిసి ఎఫ్‌2ను హిందీలో రీమేక్ చేస్తారు.  ఈ రెండు సినిమాలు బాలీవుడ్‌లో కూడా  సక్సెస్‌ అయితే... తెలుగు సినిమా.. తెలుగోడి ఖ్యాతి మరింత పెరిగినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: