ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ యంగ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కాని తన నటనతో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక కరోనా నుంచి కొలుకున్న తరువాత మళ్ళీ ఎప్పటిలానే షూటింగ్స్ తో బిజీ అయ్యాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న "ఎఫ్ 3" ప్రాజెక్ట్ తో పాటు బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా పనులను కూడా స్టార్ట్ చేసేశాడు. వరుణ్ తేజ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఈ సారి కూడా ఒక మంచి  హిట్ కొట్టాలని డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే వరుణ్ తేజ్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ ని వాడుకోబోతున్నాడు. మళ్ళీ పవర్ స్టార్  సినిమాకు సంబంధించిన పేరును కొత్త సినిమాకు టైటిల్ గా సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2005లో కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బాలు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అందులో పవన్.. బాలు, గని అనే రెండు విభిన్నమైమ పాత్రల్లో నటించాడు. అయితే వరుణ్ ‘గని’ పేరును కొత్త సినిమాకు సెట్ ఎంచుకోవడం జరిగింది.కిరణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఆ సినిమాకు మొదట బాక్సర్ అనే టైటిల్ ను అనుకున్నట్లు టాక్ వచ్చింది.

కానీ సినిమా కథలో వరుణ్ పాత్ర గని అని, ఆ పేరును ఫిక్స్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. మరి తొలిప్రేమ తరహాలోనే ఈ సినిమాకు పవర్ స్టార్ సెంటిమెంట్ వరుణ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: