నటసింహం
నందమూరి బాలకృష్ణ హీరోగా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన
సినిమా పైసా వసూల్. 2017 లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ
సినిమా ఆశించిన రేంజ్ ఫలితాన్ని అయితే అందుకోలేదు అనే చెప్పాలి. జి
ముఖేష్ ఫోటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇక ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా పార్టు 2 రానుందని అప్పట్లో పలు వార్తలు ప్రచారం అయ్యాయి. ఇక మరొక్కసారి
పూరి తో
బాలయ్య జతకట్టనున్నారు అనే వార్తలు కూడా కొద్దిరోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల తోపాటు
బాలయ్య తనయుడు
మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం
టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

దానిని బట్టి ఈ ఏడాది
జూన్ 10న తన జన్మదినం నాడు తనయుడు మోక్షజ్ఞని సినీ అరంగేట్రం చేయించాలని చూస్తున్నారట బాలకృష్ణ. అయితే అతడి తొలి సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యతల్ని
పూరి జగన్నాథ్ కి అప్పగించారట బాలయ్య. ఇటీవల ఒకానొక సందర్భంలో
పూరి జగన్నాథ్ ని కలిసిన
బాలయ్య, తామిద్దరం కలిసి మరొక
సినిమా చేద్దామని మంచి స్టోరీ ఉంటె చెప్పమని పూరిని కోరారట. అయితే కొద్దిరోజుల క్రితం మరొక్కసారి పూరిని ఆయన నివాసంలో
బాలయ్య ప్రత్యేకంగా కలిశారని, అయితే మన ఇద్దరి కాంబినేషన్లో
సినిమా విషయం ప్రస్తుతానికి పక్కనపెట్టి తన తనయుడు
మోక్షజ్ఞ ఎంట్రీ
మూవీ గురించి మంచి కథ సిద్ధం చేసి చెప్పమని కోరినట్లు సమాచారం. మొదటినుంచి
నందమూరి ఫ్యామిలీ పై ప్రత్యేకమైన అభిమానం కలిగిన
పూరి జగన్నాథ్ కూడా తప్పకుండా సిద్ధం చేస్తాను అని మాట ఇచ్చారని అంటున్నారు.
ప్రస్తుతం
విజయ్ తో లైగర్
సినిమా తెరకెక్కిస్తున్న
పూరి, అతి త్వరలో అది పూర్తయిన వెంటనే
మోక్షజ్ఞ మూవీ కథ విషయమై పనులు ప్రారంభించనున్నారని అలాగే అతి త్వరలో ఆ
మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం ఎప్పటినుండో
నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న
బాలయ్య అభిమానులకు ఇది నిజంగా సూపర్ న్యూస్ అని చెప్పక తప్పదు....!!