ఇక్కడ వర్కౌట్ కాకపోతే మరోచోటికి మకాం మార్చేయడం హీరోయిన్లకి అలవాటే కదా. ఆ జాబితాలో తాజాగా తన చిరునామాను బాలీవుడ్ కి మార్చేసే ప్రయత్నంలో పడింది విమలా రామన్. ఓ మూడునాలుగు తెలుగు సినిమాల్లో నటించినా ఇక్కడ విజయం దక్కలేదు. తమిళంలో తెరంగేట్రం చేసినా అక్కడా ఎవ్వరూ పట్టించుకోలేదు. కన్నడలో కూడా కలిసి రాలేదు. ఎక్కడా కలిసి రాలేదని ఏ మాత్రం విసుగు చెందకుండా దండయాత్రలు కొనసాగిస్తూనే ఉంది విమలా. అలా ఓ ఆంగ్లం చిత్రంలో ఆ మధ్య దర్శనమిచ్చింది. దాంతో బాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడింది. ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో నటించేందుకు విమలా సిద్ధపడుతోంది. గోవిందా సరసన ఓ కామెడీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సచిన జోషీ హీరోగా రూపొందుతున్న మరో చిత్రంలోనూ ఈమెనే కథానాయికగా ఎంపిక చేశారు. ఈ రెండూ తనకి తారగా కొత్తగా జీవితాన్నిస్తాయని విమలా కలలు కంటోంది. అక్కడైనా కలిసొస్తే... ఓ నాలుగు కాలాలపాటు నాలుగు సినిమాల్లో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: