తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలోకి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా “ఏం మాయ చేశావే”సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత కుర్రకారుల మనసులను మాయ చేసింది. మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి.

అయితే నాగచైతన్య సరసన ఏం మాయ చేసావే సినిమాలో నటించిన సమంత నిజంగానే నాగచైతన్య మనసును మాయ చేసి గెలిచింది. నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత సమంత గ్లామరస్ పాత్రలు కాకుండా, కథా ప్రాముఖ్యత ఉన్న చిత్రాలలో నటించి మరోసారి తన నటనను నిరూపించుకుంది. ఈ క్రమంలోనే రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి చిత్రాలలో నటించి మరో సారి తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుంది.ఒకవైపు పలు భాషలలో సినిమాలలో నటిస్తూనే మరోవైపు వివిధ రకాల టీవీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సమంత వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.

ఇక ప్రస్తుతం దిఫ్యామిలీ మాన్2 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పటికే ఈ సిరీస్ విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.అదేవిధంగా లేడి ఓరియెంటెడ్ తరహాలో గుణశేఖర్ దర్శకత్వంలో”శాకుంతలం” అనే సినిమాలో నటిస్తున్నారు. తన 11 సంవత్సరాల సినీ కెరీర్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత కొన్ని సినిమాలలో నటించే అవకాశాన్ని పోగొట్టుకుంది. ఇంతకీ సమంత వదులుకున్న ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

కడలి, ఎవడు, ఐ, బ్రూస్ లీ, యూటర్న్ హిందీ రీమేక్ లో నటించడానికి సమంతా ఒప్పుకోలేదు. నిన్ను కోరి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హిందీ సినిమా నటించడానికి ఒప్పుకోలేదు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు  సినిమాలో పాత్రలో నటించే అవకాశం వస్తే వదులుకున్నారు. అశ్విన్ శరవణన్, పుష్ప సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: