గీతా ఆర్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశానికి మొదటిసారిగా 100 కోట్ల సినిమాని పరిచయం చేసింది ఈ సినిమానే.200 7 లో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో తెరకెక్కించిన 'గజిని'(హిందీ) సినిమా ఇండియా లోనే మొదటి 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతటి ఘనత మన గీతా ఆర్ట్స్ ది.ట్యాలెంట్ ఉన్నవారిని ఎంకరేజ్ చేసి క్యాష్ చేసుకోవడంలో నిర్మాత అల్లు అరవింద్ గారు ఎప్పుడూ ముందుంటారు. 'గీత ఆర్ట్స్' బ్యానర్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరో పక్క 'జిఏ2 పిక్చర్స్' అనే బ్యానర్ ను స్థాపించి మీడియం రేంజ్ హీరోలతో మంచి కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను నిర్మిస్తున్నారు. బన్నీ వాస్ కు నిర్మాణ బాధ్యతల్ని అప్పగించి సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు అల్లు అరవింద్.



సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్లతో వీరు సినిమాలు చేస్తుంటారు. తాజాగా 'చి ల సౌ' దర్శకుడు ప్రముఖ గాయని చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కు కూడా వీరు అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం.రాహుల్ కొన్ని సినిమాలలో నటుడిగా కూడా ఎంతగానో మెప్పించాడు.మొదటి చిత్రంతోనే నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. ఆ తరువాత చేసిన 'మన్మధుడు2' తో పెద్దగా మెప్పించలేకపోయాడు. నాగార్జున వంటి స్టార్ హీరో ఫ్యాన్ బేస్ కూడా ఆ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. ఒకవేళ ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే..రాహుల్ కూడా మంచి స్టార్ డైరెక్టర్ అయ్యుండేవాడు.అయినప్పటికీ ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని 'గీత ఆర్ట్స్' వారికి వినిపించాడట. అది వాళ్లకు నచ్చిందని తెలుస్తుంది. అయితే ఇది ఓ స్టార్ హీరోయిన్ చేస్తేనే బాగుంటుంది అని వారు సూచించారట.ఇంకా ఎలాగో సమంత చిన్మయికి రాహుల్ కి మంచి ఫ్రెండ్ కాబట్టి ఆమెని ఒప్పించాలని చూస్తున్నాడట రాహుల్...

మరింత సమాచారం తెలుసుకోండి: