చందమామ సినిమా తర్వాత కృష్ణవంశీ చెప్పుకోదగ్గ సినిమా ఏమీ చేయలేదు. ఆయన చాలా సినిమాలు చేసిన అవన్నీ వచ్చి వెళ్లిపోయాయి తప్ప పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపలేదు. అయితే ఆయన బాలకృష్ణతో రైతులకు సంబంధించిన ఒక సినిమా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. దానికి 'రైతు' అనే టైటిల్ కూడా పెట్టి ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ ను కూడా నటింపజేయాలని అప్పట్లో ప్రయత్నించారు. అయితే ఏమైందో ఏమో కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ గ్రామంలో కృష్ణవంశీసినిమా పక్కన పెట్టేసాడు అని ఇంక దాని జోలికి వెళ్లడని ప్రచారాలు జరిగాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా శివరాత్రి రోజున ఆయన అన్నం అనే సినిమా అనౌన్స్ చేశాడు. అయితే 'రైతు', 'అన్నం' ఒకటే స్క్రిప్ట్ అనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. 

అయితే బాలకృష్ణ చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమాలో చిరంజీవిని నటింపజేయాలని కృష్ణవంశీ ప్రయత్నం చేసినట్లు ప్రచారాలు జరిగాయి. ఈ అంశం మీద స్వయంగా కృష్ణవంశీ తాను చిరంజీవిని సంప్రదించలేదని, ఇందులో ఎవరినీ ఇంకా హీరోగా అనుకోలేదు అని చెప్పడంతో దానికి బ్రేక్ పడినట్టు అయింది. అయితే ఆ పుకారు అలా చల్లబడిందో లేదో అప్పుడే మరో పుకారు మొదలైంది. అదేమంటే ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు అనే ప్రచారం మొదలైంది. 

ఈ మధ్యనే కృష్ణవంశీ ఏ.ఆర్.రెహమాన్ సంప్రదించారని దీంతో ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చేందుకు అంగీకరించాడని ప్రచారం జరుగుతోంది. అయితే కృష్ణవంశీ ఖరారు చేసే వరకు ఇది కూడా నిజమే అని నమ్మలేము. ఎందుకంటే ఏ.ఆర్.రెహమాన్ తతో మ్యూజిక్ చేయించాలంటే భారీగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి కృష్ణవంశీ మార్కెట్ కు తగ్గట్టుగా అంత భారీగా ఖర్చు పెట్టే నిర్మాతలు దొరుకుతారా అనేది కూడా అనుమానమే ? దీని మీద అధికారిక ప్రకటన వస్తే గానీ ఏమీ చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: