సిరివెన్నెల సీతారామశాస్త్రి శిష్యుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి ఆదునికంగా కనిపించే సాంప్రదాయ వాది. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని సాంప్రదాయ పాటలను మాత్రమే కాకుండా మోడ్రన్ సాంగ్స్ రాయడంలో ఈయన దిట్ట. చిరంజీవి రాజోగయ్య శాస్త్రి లకు చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం ప్రత్యక్షంగా ఎవరికీ కనపడదు.


చిరంజీవి తన ఇన్ స్థా గ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేసిన తరువాత తన వ్యక్తిగత ఫోటోలను తన చిన్ననాటి విషయాలను అనేకం షేర్ చేస్తూ ఉండటంతో అతడికి 1 మిలియన్ ఫాలోయర్స్ ఏర్పడ్డారు. అయితే చిరంజీవి ఎప్పుడు ఎవర్ని సోషల్ మీడియాలో ఫాలో కాలేదు. అయితే కొంత కాలం క్రితం చిరంజీవి రామజోగయ్య శాస్త్రిని ఫాలో అవ్వడం చూసి చాలామంది ఆశ్చర్య పడటమే కాకుండా వీరిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందా అంటూ షాక్ అయ్యారు.


అయితే ఎవరు ఊహించని విధంగా చిరంజీవి సోషల్ మీడియా ఎకౌంట్ లో ఫాలోయర్స్ లిస్టులో ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి పేరు కనిపించక పోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలా చిరంజీవి రామజోగయ్య శాస్త్రిని  ఫాలో కాకపోవడం వెనుక ఏదైనా ఒక ఆలోచన ఉందా లేకుంటే ఇది పిఆర్ టీమ్ చేసిన పొరపాటుగా భావించాల అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి కరోనా లాక్ డౌన్ సమయంలో చిరంజీవికి సమయం బాగా దొరకడంతో సోషల్ మీడియాలో సందడి ఎక్కువ చేసాడు.


ఇండస్ట్రీకి సంబంధించి ఏ ప్రముఖుడుకి గౌరవాలు సత్కారాలు లభించినా ఏదైనా ఒక చిన్న సినిమా ఊహించని విధంగా హిట్ అయినా ప్రశంసలు కురిపిస్తూ అభినందించడం చిరంజీవి అలవాటుగా మార్చుకున్నాడు. సీనియర్ హీరోలు వెంకటేష్ బాలకృష్ణలు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా చిరంజీవి మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాడు. మొదటి నుంచి తన అభిమానుల చేత సామాజిక కార్యక్రమాలు చేసే విషయంలో చాల చైతన్య వంతంగా ఉండే చిరంజీవి వ్యూహాల వెనుక ఎదో అర్థం ఉండే ఉంటుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: