దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయని సినిమా ప్రారంభం నుంచే అనేక ఆసక్తికర అప్డేట్స్ వస్తున్నాయి. సంగీత దర్శకుడు కాలభైరవ తారక్, చెర్రీ లపై కంపోజ్ చేసిన ఒక పాట అందరినీ కంటతడి పెట్టిస్తుందని రీసెంట్ గా సినీవర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పలికించే భావోద్వేగ హావభావాలు ప్రేక్షకుల మనసులను అమాంతం హత్తుకుంటాయని చిత్ర బృందం నుంచి టాక్ వినవచ్చింది. దేశభక్తి సన్నివేశాలు ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేస్తాయి అని.. ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య చోటుచేసుకునే ఒక్క సన్నివేశం మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కారాగారంలో కలిసే ఒక సన్నివేశం వెంట్రుకలు నిక్క పొడిచేలా చేస్తుందట. ఆ సన్నివేశం చూడగానే బాధ, సంతోషం వంటి 2 భావాలు ప్రేక్షకులలో ఒకేసారి కలుగుతాయట. ఇలాంటి సన్నివేశాలు ఆర్ఆర్ఆర్ లో ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తోంది. ఇకపోతే ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబర్ 13, 2021న విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల తేదీ 2022, వేసవికి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.



ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఐరిష్ అందాలరాశి ఒలివియా మోరీస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ తో తొలిసారిగా అలియా రొమాన్స్ చేయబోతున్నారు. అచ్చతెలుగు పదహారణాల అమ్మాయి వలె అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కనిపించునున్నారని ఇటీవల విడుదలైన పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఎం.ఎం కీరవాణి ఈ ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ అండ్ యాక్షన్ సినిమాకి ఎటువంటి సంగీతాన్ని అందిస్తారో చూడాలి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రూ.890 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ నుంచి ఈ చిత్రానికి రూ. 300 కోట్లు ముట్టాయని.. మ్యూజికల్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లు వచ్చాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: