మ‌గ‌ధీర త‌ర‌వాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన సినిమా  ఆరెంజ్. 2010లో వ‌చ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది కానీ ఇప్ప‌టికీ ఈ సినిమాకు ఇప్ప‌టికీ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంటుంది. ఎప్పుడు టీవీలో వ‌చ్చినా ఆరెంజ్ కు ఓ రేంజ్ లో రేటింగ్ వ‌స్తుంది. సాధార‌ణంగా టాలీవుడ్ లో ల‌వ్ స్టోరీల‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ సినిమా ప్రేమ ఎక్కువ కాలం ఒకేలా ఉండ‌దు అనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాంతో థియేట‌ర్ లో సినిమాకు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోయారు. కానీ సినిమ‌ను అర్థం చేసుకున్నాక మాత్రం ఇదొక గొప్ప ల‌వ్ స్టోరీ అని అర్థం చేసుకున్నారు. సినిమా వాషయానికి వ‌స్తే తాను ప్ర‌త్యక్షంగా చూసిన అనుభ‌వాల‌తో రామ్ చ‌ర‌ణ్ రామ్ ప్రేమ ఎక్కువ కాలం ఒకేలా ఉండ‌ద‌నే నిర్ణ‌యానికి వ‌స్తాడు. స‌ముద్ర‌మంత ప్రేమ‌కావాలి కాని పెళ్లి వ‌ద్దంటాడు. 

మొద‌ట రూబ తో ప్రేమ‌లో ప‌డిన రామ్ కొంత కాలం ప్రేమ‌లో ఉండి విడిపోతాడు. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉంటాయి. ఆ త‌ర‌వాత రామ్...సిడ్నీలో జాను తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. జానులోని అమాయ‌క‌త్వం..చిన్న‌పిల్ల మ‌న‌స్థ‌త్వం రామ్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అప్ప‌టివ‌ర‌కూ ప‌లువురిని ప్రేమించి విడిపోయిన రామ్ జాను తో మాత్రం విడిపోలేక‌పోతాడు. కానీ జీవితాంతం త‌నకు ప్రేమ కావాల‌ని పెళ్లి వ‌ద్ద‌నే దైలామాలోనే ఉంటాడు. ఆ విష‌యంలో రామ్ కు క్లారీటీ వ‌చ్చేలా జాను చేయ‌డంతో చివ‌రికి ఒప్పుడుకుంటారు. అంతే కాకుండా తాను పెళ్లి చేసుకున్న‌వాళ్లు ప్రేమ‌లో ఉండ‌రు అనే త‌న నిర్ణ‌యం త‌ప్ప‌ని తెలుసుకుంటాడు. ఇలా ప్రేమిస్తూ విడిపోతూ ఉంటే జీవితాంతం ఒంట‌రిగానే మిగిలిపోతాన‌ని గ్ర‌హిస్తాడు. ఇక ఈ బ్యూటిఫుల్ ప్రేమ‌కథా చిత్రానికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మెగాబ్ర‌ద‌ర్ నాగబాబు నిర్మించారు. ఇక ఈ చిత్రానికి హ్యారీస్ జ‌యరాజ్ అందించిన సంగీతం ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: