పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం చేసి పాతిక సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఈ పాతికేళ్ళ పవన్ సినిమా కెరీర్ లో ఒక ఏడాది మాత్రం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకుంటారు. ఆ ఒక్క ఏడాది పవన్ కెరీర్ లో ఉండకపోతే.. ఆయనకు పవర్ స్టార్ ఇమేజ్ రాకపోయి ఉండేదేమో. ఇక ఆ ఒక్క ఏడాది ఏంటంటే.. 1998వ సంవత్సరం. ఆ ఏడాదిలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన చిత్రాలు తీసి టాలీవుడ్ ప్రేక్షకులను అబ్బుర పరిచారు. 1998 సంవత్సరం తో పవన్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ 1996లో "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు. కానీ ఆ సినిమా అతనికి ఎటువంటి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. 1997లో గోకులంలో సీత సినిమాలో పవన్ హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా పవన్ ని హీరోగా నిలబెట్ట లేకపోయింది. కానీ 1998లో వచ్చిన సుస్వాగతం, తొలిప్రేమ చిత్రాలు పవన్ కళ్యాణ్ కి స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి.


దర్శకుడు ఎ.కరుణాకరన్ తెరకెక్కించిన తొలిప్రేమ చిత్రం లో పవన్ సరసన కీర్తి రెడ్డి నటించారు. అయితే "తొలిప్రేమ" కి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు లభించింది. అంతేకాదు ఈ చిత్రానికి 6 నంది పురస్కారాలు కూడా లభించాయి. ఈ చిత్రం 21 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది. 2 కేంద్రాలలో 200 రోజులకు పైగా ఆడి రికార్డు సృష్టించింది. తొలిప్రేమ సినిమా తో పవన్ కి బీభత్సమైన స్టార్డం వచ్చింది.



దళపతి విజయ్ హీరోగా నటించిన తమిళ మూవీ "లవ్ టుడే" 1997లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇదే సినిమాని భీమనేని శ్రీనివాసరావు తెలుగులో సుస్వాగతం గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, దేవయాని హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే తమిళ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కి తగ్గట్టుగా శ్రీనివాసరావు సుస్వాగతం సినిమాని రూపొందించారు. అయితే 1998, జనవరి ఒకటవ తేదీన విడుదలైన సుస్వాగతం సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. దీంతో పవన్ కి బీభత్సంగా అభిమానులు పెరిగిపోయారు. అందుకే పవన్ కెరీర్ లో 1998 సంవత్సరాన్ని ప్రత్యేకమైనదని చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: