బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. ఆయన పూర్తిగా చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం మానేశారు. బాహుబలి తర్వాత సొంత ప్రొడక్షన్ అయిన యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ తో సాహో సినిమా తీసి రిలీజ్ చేయగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. ఇప్పుడు అదే సంస్థతో రాధేశ్యామ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ప్రభాస్సినిమా కాక ఇప్పటికే ఆయన నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టగా ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా చాలా మంది నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒక దర్శకుడికి టచ్ లోకి వచ్చినట్లు తాజాగా తెలుస్తోంది.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే పరిస్థితి నెలకొంది. సాహో అనే సినిమా ఊహించినంత ఆదరణ దక్కించుకోకపోవడంతో ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకి కూడా మార్పులు చేర్పులు సూచించారు. మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ మరింత లేట్ అవుతోంది. ప్రభాస్ హెయిర్ స్టైలిస్ట్ కు కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగు నిలిపివేశారు.

ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆదిపురుష్, సలార్ సినిమాలను షూటింగ్ దశ లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇన్ని సినిమాలు ఉండగా ఇంకా ప్రభాస్ కోసం ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూసే దర్శకులు నిర్మాతలు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా డార్లింగ్ సినిమా చేసిన దర్శకుడు కరుణాకరణ్ స్క్రిప్ట్ తో ప్రభాస్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నారట. డార్లింగ్ సినిమా ఫలితం ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ని నిద్ర లేకుండా చేస్తున్న నేపథ్యంలో కరుణాకరన్ ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: