
ప్రస్థానం సినిమా తరహాలోనే మరోసారి తన మార్క్ సినిమా చేస్తున్నాడు దేవా కట్టా. రిపబ్లిక్ అంటూ వ్యవస్థలోని లోటు పాట్లని వేలెత్తి చూపించబోతున్నాడు. అంతేకాదు సినిమాలో డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా ఉంటాయని అంటున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది. సాయి ధరం తేజ్ డబ్బింగ్ పూర్తి చేయగానే సినిమా ఫైనల్ మిక్సింగ్ చూసుకుని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.
సినిమా ఈపాటికి రిలీజ్ అవ్వాల్సి ఉన్న కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాతో ఫాం లోకి రావాలని చూస్తున్నాడు దేవా కట్టా. సాయి ధరం తేజ్ కూడా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నిరాశపరచింది కాబట్టి ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ సుకుమార్ అసిస్టెంట్ కార్తీక్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. సుకుమార్ కూడా ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొన్నాడని టాక్.