సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ అందరూ స్టార్ సెలబ్రెటీల లాగానే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించి స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న ఒక కొత్త సినిమాని లాంచ్ చేశారు. అయితే ఈ చిత్ర కథ నచ్చడంతో కొరటాల శివ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, కృష్ణ కొమ్మ‌ల‌పాటి తన అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వి.వి.గోపాల కృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

ఐతే ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ తెర మీదకు వచ్చింది. అది ఏంటంటే ఈ సినిమాని విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారట. ఈ సినిమా కథ విజయవాడ లోని గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకుంటుందని సమాచారం. సత్యదేవ్ ఇప్పటికే విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాల్లో చాలా సహజంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. ఇక కొరటాల శివ సమర్పణలో ప్రొడక్షన్ నంబర్ 2 గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆయన అద్భుతమైన నటనా చాతుర్యాన్ని కనబరుస్తారని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి కాలభైరవ ని సంగీత దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా పని చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సత్యదేవ్ తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం, గాడ్సే, రామసేతు వంటి సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలకు పని చేస్తున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన టాలెంట్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. కొరటాల శివ సమర్పణలో రాబోయే సినిమా ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: