ప్రముఖ వ్యాఖ్యాత, సినీ నటి హరితేజ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అందరి బంధువయా వంటి చిత్రాల్లో చిన్న చిత్రాల్లో నటించి వెండితెరకు సుపరిచితురాలు అయ్యారు. ఆ తర్వాత ఆమె సీరియల్ నటీమణిగా బుల్లితెరపై తెరంగేట్రం చేసి ప్రేక్షకులను బాగా అలరించారు. చాలా యాక్టివ్ గా ఉండే హరితేజ బిగ్‌బాస్ షో లో కూడా పాటిస్పేట్ చేసి తన క్రేజ్ ని బాగా పెంచుకున్నారు. కూచిపూడి డాన్స్ నేర్చుకున్న హరితేజ పాటలు కూడా పాడగలరు. ఈ టాలెంట్స్ తోనే ఆమె పండగ చేస్కో, అభిరుచి, సొగసు చూడతరమా, సూపర్ సింగర్ వంటి ప్రోగ్రాములలో అవలీలగా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


ఆమెకున్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఆమె ప్రతి రోజు పండగే, హిట్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. 2015 సంవత్సరంలో ఈమె దీపక్ రావ్ ని పెళ్లాడారు. అయితే ఇటీవలే హరితేజ ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ ముద్దుల బిడ్డకు ఆమె భూమి అని నామకరణం చేశారు. తన కూతురు పేరు భూమి అని కొద్ది రోజుల క్రితం వెల్లడించిన ఆమె.. "భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, సహనాన్ని పరీక్షిస్తే భూకంపలే" అంటూ ఒక చలోక్తి విసిరారు.



అయితే హరితేజ తాను గర్భం దాల్చిన సమయం నుంచి తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కూతురు పుట్టిన తర్వాత కూడా ఆమె క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ ఇచ్చారు. అయితే ఆమె కూతురు ఫోటోలను చూడాలని అభిమానులు గత కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నారు.



 ఈ తరుణంలో హరి తేజ తన కూతురి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అభిమానులను ఫిదా చేశారు. ఫొటోలతో పాటు ఆమె తన భర్త తన కూతురిని ఆడిస్తున్న ఒక వీడియో కూడా షేర్ చేశారు. భూమికని వదిలి తన భర్త దీపక్ రావ్ ఉండలేకపోతున్నారని.. భూమితో పొద్దస్తమానం సమయం గడుపుతున్నారని.. భూమి ఆయనతో లేనప్పటికీ తనతో ఉన్నట్లే భ్రమపడుతూ ఆడిస్తున్నారని కూడా ఆమె చెప్పుకొచ్చారు.

అయితే ఈ ఫొటోలపై హరితేజ బంధువులు, తోటి యాంకర్స్, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సో క్యూట్, లవ్లీ చైల్డ్, భూమి అచ్చం మీలాగే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: