గ్లామర్ ఇండస్ట్రీలో అసలైతే పెళ్లి తర్వాత హీరోయిస్ కు అసలేమాత్రం డిమాండ్ ఉండదు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. టాలెంట్ ఉంటే చాలు కాని ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదరగొట్టేయొచ్చు అని భామలు ప్రూవ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత హీరోయిన్స్ గా పనికిరారనుకున్న వాళ్లకి చెంప పెట్టుగా అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలతో రాణిస్తుంది. కేవలం సినిమాలే కాదు వెబ్ సీరీస్ డిజిటల్ షోస్ తో వారెవా అనిపిస్తుంది. సమంత చూపించిన ఈ బాటలోనే మరికొందరు నడుస్తున్నారు.

ముఖ్యంగా ఈమధ్యనే పెళ్లి చేసుకున్న సౌత్ గ్లామర్ హీరోయిన్ కాజల్ కూడా సమంత బాటలో నడుస్తుంది. పెళ్లి తర్వాత ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ వస్తున్న కాజల్ కమర్షియల్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనలో ఉంది. అంతేకాదు సిస్టర్, మదర్ రోల్స్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పట్లేదని తెలుస్తుంది. పాత్ర ప్రాధాన్యతని బట్టి ఎలాంటి పాత్ర అయినా చేసేస్తానని చెబుతుంది కాజల్.

తన దగ్గరకు వచ్చిన కథల్లో పాత్రకు ప్రాధాన్యత ఉన్న వాటికే ఓకే చెబుతుందట కాజల్. తను చేస్తున్న ఆచార్య, ఇండియన్ 2 సినిమాలు మాత్రమే చివరి కమర్షియల్ సినిమాలని భావిస్తుందట. భర్త గౌతం కిచ్లు కూడా కాజల్ ప్రత్యేక పాత్రలు చేస్తే ఎలాంటి అభ్యంతర చెప్పడం లేదట. సమంత అయినా హీరోయిన్ గానే చేస్తుంది కాని కాజల్ ఇంకాస్త ముందుకెళ్లి మదర్ రోల్స్ కు సై అనేస్తుందట. మొత్తానికి ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఇద్దరి హీరోయిన్స్ కెరియర్ మాత్రం జోరుగానే ఉందని తెలుస్తుంది. జాను తర్వాత సమంత కొద్దిపాటి గ్యాప్ ఇవ్వగా కాజల్ మాత్రం నాని నిర్మిస్తున్న మీట్ క్యూట్ లో కూడా అమ్మడు నటిస్తుంది. ఈ సినిమాలో కాజల్ తో పాటుగా మరో నలుగురు హీరోయిన్స్ ఉంటారని టాక్. ప్రయోగాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో కాజల్ కు మంచి రోల్ ఇచ్చారని తెలుస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: