ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో న‌టుడిగా మంచి పేరు వ‌చ్చింది. ప్రస్తుతం అతడు తిమ్మ‌రుసు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ట్యాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ కథానాయిక న‌టిస్తోంది. ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ క‌ప్పి శెట్టికి ఇది రెండ‌వ చిత్రం మొద‌టిది కిరాక్ పార్టీసినిమా అప్ప‌ట్లో బ్లాక్‌బాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్‌ను త్వ‌ర‌లోనే పూర్తి చేసుకుని ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. సినిమా టైటిల్‌ను విజయనగర సామ్రాజ్యానికి చెందిన మహామంత్రి తిమ్మరుసు పేరునే ఎంపిక చేయడం ఆసక్తికరంగా ఉంది.


 సత్యదేవ్ -ప్రియాంక జవాల్కర్ జంటపై తెరకెక్కించిన ప్రోమో సాంగ్ నుంచి ఒక ఫోటో తాజాగా రిలీజైంది. ఈ ఫోటోలో సూట్ ధరించిన సత్యదేవ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అలాగే ప్రియాంక జవాల్కర్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. వైట్ షర్ట్ మినీ స్కర్ట్ ధరించి గాగుల్స్ పెట్టుకుని కార్ పై కూచుని గాలి పంకాను ఆస్వాధిస్తూ ఎంతో పోష్ లుక్ తో ఆకట్టుకుంటోంది.  ప్రోమో షూట్ నుండి వారి స్టిల్స్‌  స్టైలిష్ గా సినిమా అభిమానుల‌ను ఆకట్టుకుట్టున్నాయి. ఈ ఫోటో చూస్తే ప్రియాంక త‌న అందాల‌ను ఆర‌బోస్తుందేమోన‌ని అంటున్నారు.
 

ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్- ఎస్ ఒరిజినల్స్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుజన్ యరబోలు ఒక నిర్మాతగా ఉన్నాడు. తిమ్మ‌రుసు కోవిడ్ -19 సెకండ్ వేవ్ తరవాత రిలీజవుతున్న తొలి చిత్రంగా రికార్డులకెక్క‌నుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. నారప్ప, దృశ్యం 2, విరాటపర్వం థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఓటీటీల్లో రిలీజవుతున్నాయేమోన‌ని ప్రచారం సాగుతోంది.


స‌త్య‌దేవ్ కంచ‌ర‌న స‌పోర్టింగ్ రోల్స్ చేసుకుంటు ప్ర‌స్తుతం హీరో స్థాయికి ఎదిగారు. ఇంత‌క ముందు స‌త్య‌దేవ్ జ్య‌తిల‌క్ష్మి, క్ష‌ణం, మ‌న ఊరి రామాయ‌ణం, బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, బ్రోచేవారెవ‌రురా సినిమాల్లో హీరోగా న‌టించి గుర్తింపు తెచ్చుకున్నారు. స‌త్య‌దేవ్ ప్ర‌స్తుతం తిమ్మ‌రుసు చిత్రంతో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ త‌రువాత గుర్తుందా సీతాకాలం, రామ్ సేతు, స్కైలాబ్, గాడ్సె లాంటి సినిమాల్లో న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇందులో ఒక‌టి హిందీ మూవీ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: