టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా సాంకేతిక నిపుణుడిగా నిలదొక్కుకోవాలంటే తప్పకుండా హిట్ రావాలి. టాలెంట్ అవకాశాలు అనేది పక్కన పెడితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చూసుకోవాలి. లేదంటే ఎన్ని అవకాశాలు వచ్చినా హిట్ దొరక్క ఫేడ్ అవుట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా ఇప్పటి వరకు వచ్చిన చాలామంది నటీనటులు చేసిన రెండు మూడు సినిమాలతోనే హిట్ కొట్టి సెటిల్ అయిపోయారు.

ఇంకొంతమంది అయితే మొదటి సినిమాతోనే పాపులారిటీ దక్కించుకుని స్టార్లు అయిపోయారు.  ఆ విధంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది ఒకటి రెండు సినిమాలతో స్టార్ లు అయిపోగా వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్లతో స్టార్ హీరోగా మారాడు.  రాజ్ తరుణ్. ఆయన చేసిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో బుల్లితెర హీరోయిన్ అయిన అవికాగోర్ కూడా టాలీవుడ్ కి పరిచయం అవ్వగా వీరిద్దరికీ ఈ సినిమా ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. 

సినిమా తరువాత రాజ్ తరుణ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను దక్కించుకోవడంతో రెండో అవకాశం రావడానికి ఎంతో సమయం పట్టలేదు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఆయన సినిమా చూపిస్త మామ అనే సినిమా చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన తర్వాత కుమారి 21ఎఫ్ అనే పెద్ద సినిమాతో సుకుమార్ ప్రొడక్షన్ లో కనిపించి స్టార్ అయిపోయాడు. వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధించడంతో రాజ్ తరుణ్ కు మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అవి హిట్ కాకపోవడంతో మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన సినిమాలు మినిమం రేంజ్ హీరోగా కూడా నిలబెట్టలేకపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: