ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ గొప్ప అదృష్టవంతురాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతోమంది అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వారి కష్టానికి అనుకున్నంత గుర్తింపు లభించకపోవచ్చు. ఇది ప్రియా ప్రకాష్ వారియర్ కు పూర్తి భిన్నం, ఎందుకంటే సినిమా రంగంలో ఎవరైనా క్రేజ్ సంపాదించాలని అంటే కనీసం వారి ఒక సినిమా అయినా విడుదల అవ్వాలి. కానీ ఇవేవీ లేకుండానే ఒక చిన్న ప్రోమో లో కన్ను కొట్టి ఇండియాలో ఉన్న కుర్రకారు మనసు దోచుకున్న  ముద్దుగుమ్మ ప్రియా వారియర్. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో తేజ సజ్జ హీరోగా 'ఇష్క్'  నాట్ ఎ లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ నటి కొన్ని విషయాలను తెలియజేసింది. అందులో భాగంగా నేను హీరోయిన్ గా నటించిన 'లవర్స్ డే' సినిమా ప్రోమో విడుదల అయిన తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి.


కాకపోతే నేను అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాను. ఈ మధ్యనే నాది బీకాం పూర్తి అయ్యింది. ప్రస్తుతం 'లవర్స్ డే' సినిమా ప్రోమో విడుదల అయిన తర్వాత వచ్చిన అన్ని సినిమా అవకాశాలు ఇప్పుడు రావడం లేదు. కానీ నేను దానికి ఏ మాత్రం బాధ పడడం లేదు అని తెలిపింది. మరియు మలయాళ 'ఇష్క్' సినిమాను చూసి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇది అన్ని లవ్ స్టోరీ లా రొటీన్ గా ఉండదు. మలయాళం సినిమాలోని కథను తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి  దర్శకుడు రాజు ఈ సినిమాను తీర్చిదిద్దాడు, ఈ సినిమా ఈనెల 30 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది అని, ఈ సినిమా మీకు మంచి ఫీలింగ్ కలగజేస్తుంది అని ఈ సందర్భంగా ప్రియా ప్రకాష్ వారియర్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: