మోడల్‌గా ప్రారంభమై హీరోయిన్గా ఎదిగిన తనకు బాలీవుడ్లో అవకాశాలు చాలానే వచ్చాయని తెలిపింది నర్గీస్. అయితే,
తాను హయ్యర్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్న చోట జీవించేందుకు ప్రయత్నించానని, అందువల్లే తాను బాలీవుడ్ మాత్రమే కాకుండా పలు చోట్ల నుంచి తరిమివేయబడ్డానని చెప్పింది. నగ్నంగా నటించడం తనకు ఇష్టం లేదని, అందుకే అవకాశాలు తగ్గిపోయాయని షాకింగ్ కామెంట్స్ చేసింది ఫక్రి. తనకు నైతిక విలువల కంటే మరేవీ గొప్పవి కావని నర్గీస్ ఫక్రి పేర్కొంది. మోడలింగ్ సమయంలో చాలా మంది టాప్ లెస్ షాట్స్ తీసేందుకు ప్రాధాన్యతిస్తారని, యాడ్‌లో నగ్నంగా కనిపంచాలని అడుగుతారని చెప్పింది. అయితే, తాను అలాంటి షూట్స్‌తో అసౌర్యంగా ఫీలవుతానని చెప్పింది. ఇకపోతే ఇంతియాజ్ అలీ డైరెక్షన్లో వచ్చిన ‘రాక్‌స్టార్’ ఫిల్మ్‌లో నర్గీస్ నటనకుగాను మూవీ లవర్స్‌తో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ద్వారా నర్గీస్ ప్రతిభ బయటకు వచ్చిందని సినీ ప్రముఖులు అప్పట్లోనే ప్రశంసలు కురిపించారు. తొలి చిత్రంలోనే రణ్‌బీర్ కపూర్‌తో రొమాన్స్ చేసే అవకాశం లభించడం పట్ల నర్గీస్ కూడా ఆనందం వ్యక్తం చేసింది. ‘రాక్‌స్టార్’ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయిన సంగతి అందరికీ విదితమే. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమాలోనూ కీ రోల్ ప్లే చేసింది నర్గీస్. ఈమె చివరగా సంజయ్ దత్ చిత్రం ‘తోర్బజ్’లో ప్రేక్షకులకు కనిపించింది.