సంజయ్ దత్.. బాలీవుడ్‌ సినిమా  హీరో,  కానీ సంజయ్ జీవితమే ఒక సినిమా.  తొలి సినిమా 'రాకీ'తోనే స్టార్ అయ్యాడు.  ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నా..  భారతీయ సినీ ప్రపంచంలో తిరుగులేని రారాజు అనిపించుకునే సమయంలో  ఒక్కసారిగా  అగ్రస్థాయి నుండి  పతనావస్థకు పడిపోయిన దురదృష్టవంతుడు.  స్టార్ గా  ప్రసిద్ధి పొందినా, సినీ  కెరీర్ ఉచ్ఛ స్థాయిలో ఉన్నా..  1993లో  జరిగిన ముంబై బాంబు పేలుళ్ల సంఘటన  అతన్ని జీవితాన్ని కబళించింది.  

 
అన్నిటికీ మించి అప్పటికే  సంజయ్ దత్  మత్తుపదార్థాలలో పడి నలిగిపోయాడు.  ఆ సమయంలోనే  తల్లి మరణం సంజయ్ దత్ ను బాగా క్రుంగదీసింది. దాంతో మత్తుకు మరింత దగ్గరయ్యాడు, చివరకు  బానిస అయ్యాడు. దీనికితోడు  తిరుగుబాటు మనస్తత్వం అలవడింది సంజయ్ కి. మరోపక్క  సినిమాల్లో వరుస  విజయాలు వస్తున్నాయి.


రోజురోజుకు అభిమానులు అతన్ని ఆరాధించడం ఎక్కువ అవుతుంది. అయితే,  ఆ స్టార్ స్టేటస్ ను సంజయ్ హ్యాండిల్ చేయలేకపోయాడు.  తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు   లోనయ్యాడు.  తానూ మత్తు పదార్థాలకు బానిస కావడం వల్లనే తన తల్లి  నర్గీస్ ఆరోగ్యం క్షీణించిందనే  బాధ సంజయ్ ని పట్టి పీడించింది. దాంతో షూటింగ్ కి వెళ్ళకుండా మత్తులోనే మునిగిపోయాడు.


తండ్రి సునీల్ దత్తు  అమెరికాలోని డ్రగ్ రిహాబిలేషన్ సెంటర్‌ కు ఎలాగోలా ఒప్పించి  పంపించాడు. సంజయ్  మత్తు పదార్థాలకు స్వస్తి చెప్పి  ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. కానీ,  1993 ముంబై పేలుళ్ల ఘటనతో  సంజయ్  జీవితం అనుకోని మలుపు తిరిగింది.  అరెస్టయ్యాడు. 18 నెలల పాటు జైలులో ఉన్నాడు.

జీవితంలో ఎన్నో చూసినా  ఇప్పటికీ అంతే ఉత్సాహంగా కనిపిస్తాడు సంజయ్. ఇప్పటికే సంజయ్ జీవితంపై సినిమా వచ్చినా..  సినిమాకి మించిన డ్రామా సంజయ్ జీవితంలో ఉంది.  నిజానికి సంజయ్ లైఫ్ స్టైల్ కి అలాగే సంజయ్ స్టార్ డమ్ కి ఏ మాత్రం పొంతన ఉండదు. ఇక ప్రస్తుతం సంజయ్ వరుస సినిమాలతో ఫుల్ జిబిగా ఉన్నాను.    
 

మరింత సమాచారం తెలుసుకోండి: