2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రపంచ దేశాలను భయపెట్టిన కరోనా వైరస్ గురించి ఎవ్వరూ మరిచిపోలేరు. అంతలా ఇది మన జీవితాల్లో తన దైన ముద్ర వేసింది. దీని బారిన పడి కోట్లాదిమంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ కరోనా వైరస్ కొన్ని దేశాలలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. అందులో మన ఇండియా కూడా ఒకటి. అప్పట్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. తద్వారా అన్ని పరిశ్రమలు మూతబడ్డాయి. ఎంతో మంది తమ ఉద్యోగాలను సైతం కోల్పోయి వీధిన పడ్డారు. వీరిలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కార్మికులు మరియు ఇతర నటీనటులు కూడా ఉన్నారు. షూటింగ్ లు ఆగిపోవడంతో రోజు వారీ కార్మికులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ విధంగా 2019 నుండి 2021 వరకు సినిమాలు చాల వరకు షూటింగ్ లు జరగక రిలీజ్ కాలేదు.

అయితే కరోనా కాస్త గ్యాప్ ఇవ్వడంతో 2021 జనవరిలో సంక్రాంతి కానుకగా మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినా క్రాక్ మాత్రమే సూపర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా లో రవితేజ పోలీస్ అధికారిగా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రవితేజకు జంటగా శృతిహాసన్ నటించింది.  ఈ సినిమా మంచి రికార్డులను సొంతం చేసుకుంది. ఇవన్నీ ఓ ఎత్తు అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ఐటెం సాంగ్ మరో ఎత్తు అని చెప్పాలి. ఒక సినిమాకు ఐటెం సాంగ్ అంటే ఎలా ఉండాలో కరెక్ట్ గా అలానే సూట్ అయింది. ఈ పాటలో లిరిక్స్ నుండి స్టెప్స్ వరకు ప్రతిదీ కూడా అద్బుతం అని చెప్పాలి.

ఈ పాటను రామజోగయ్య శాస్త్రి చాలా చక్కగా  రాశారు. ఈ పాటలోని ప్రతి పదం మాస్ ను పరిచయం చేస్తుంది. అంతే అధ్బుతంగా ఈ పాటకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇంకేముంది మాస్ సాంగ్ లను పాడడంలో  దిట్ట అయిన సింహ మరియు మంగ్లి లు ఈ పాటతో ఒక ఆట ఆడుకున్నారు. ఈ పాట "బూమ్ బద్దలు బూమ్ బద్దలు..." అంటూ మొదలవుతుంది. ఈ పాటలో మొదటి సారిగా ఆర్జీవీ హీరోయిన్ అప్సర రాణి ఐటెం సాంగ్ లో నటించింది. చిన్న పిల్లవాడి నుండి పెద్ద వయసు వారి వరకు ఈ పాట వినిపిస్తే కాలు కదపాల్సిందే అంతలా ఇది వైరల్ అయింది. ఇప్పటికీ యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. రవి తేజ కెరీర్ లో ఒక సూపర్ డూపర్ హిట్ గా నిలచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: