కొంతమంది యాక్టర్  అవ్వబోయి డాక్టర్  అయ్యాము అంటారు. కానీ యాక్టర్ అయిన డాక్టర్ లు తెలుగు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. ఉద్యోగ రీత్యా డాక్టరుగా కొన్నాళ్ళు పాటు సేవలందించి, ఆ తర్వాత నటన పై మక్కువతో సినిమా రంగం వైపు మొగ్గు చూపిన టాలీవుడ్ యాక్టర్స్ కమ్ డాక్టర్స్ ఎవరెవరో చూద్దాం.

మందాడి. ప్రభాకరరెడ్డి :
ప్రభాకర్ రెడ్డి గారు  క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రచయితగా ఎన్నో తెలుగు సినిమాలకు పనిచేశారు.  నేటి తరానికే తెలియదు, ఆయన డాక్టర్. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి ఆయన  వైద్య విద్యను అభ్యసించారు.



యాంగ్రీ యంగ్‌మేన్‌ రాజశేఖర్ :
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో.   రాజశేఖర్ కూడా ఉద్యోగ రీత్యా వైద్యుడే.  చెన్నైలో ఎంబిబిఎస్ చేసిన ఆయన, కొన్నాళ్ళు పాటు డాక్టరుగా కూడా ప్రాక్టీస్ చేశారు.




సాయి పల్లవి :
'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ టాలెంటెడ్ నటి  కూడా డాక్టరే.  జార్జియాలోని బీసీబీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి సాయి పల్లవి ఎంబిబిఎస్ పూర్తి  చేశారు.  



నారమల్లి శివప్రసాద్ :

 తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా రాణించడంతో పాటు  తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కూడా ఆయన సేవలందించి, లోక్ సభకు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఈయన సినిమా రంగంలోకి రాకముందు డాక్టర్ గా సేవలందించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆయన ఎంబిబిఎస్ డిగ్రీ తీసుకున్నారు.  



భరత్ రెడ్డి :
భరత్ రెడ్డి ప్రస్తుతం వస్తున్న  అనేక తెలుగు సినిమాల్లో  సహాయ నటుడిగా నటిస్తూ రాణిస్తున్నారు. ఇప్పటికీ   హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కార్డియాలజిస్టు గా  సేవలందిస్తుండటం విశేషం.  భరత్ రెడ్డి   అర్మేనియా లోని ఎరెవన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సినిమాల్లో నటించడం అనేది ఆయన పార్ట్ టైమ్ హాబీ.



రవి ప్రకాష్ :
తెలుగు సినిమాల్లో ప్రస్తుతం మరో సహాయ నటుడిగా రాణిస్తున్న నటుడు రవి ప్రకాష్. ఈయన కూడా డాక్టరే. రష్యాలో ఎంబిబిఎస్ చేశారు.  



అదితి గోవిత్రికర్ :
ఈ పేరు గుర్తులేదు కదా.   పవన్ కళ్యాణ్  'తమ్ముడు' సినిమా హీరోయిన్‌ ఈమె.  అదితి గోవిత్రికర్ తమ్ముడు  సినిమా చేసే సమయానికే  డాక్టర్. ముంబయిలోని గ్రాంట్ మెడికల్ కాలేజీ నుండి ఆమె  ఎంబిబిఎస్ పూర్తి  చేశారు. పైగా  ఆ తర్వాత గైనకాలజీలో  ఎంఎస్ కూడా  చేశారు.


శ్రీకాంత్ అయ్యంగార్ :
ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా పాపులర్ అవుతున్న టాలెంటెడ్ నటుడు ఇతను.  ఈయన కూడా డాక్టరే. నటన మీద ఆసక్తితో  డాక్టర్ వృత్తికి ఫుల్ స్టాప్ పెట్టి.. సినిమా రంగంలోకి వచ్చి రాణిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: