మహేష్ బాబు హీరోగా సమంత హీరోయిన్ గా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'దూకుడు'. ఈరోజు మనం 'దూకుడు' సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
అది 2009 'ఖలేజా' షూటింగ్ జరుగుతున్న సమయం. ఒక సాంగ్ షూటింగ్ మధ్యలో కొంత గ్యాప్ రావడంతో తనకోసం ఎదురు చూస్తున్న శ్రీను వైట్ల  దగ్గరికి మహేష్ బాబు వెళ్ళాడు. వెళ్లి వెంటనే మనం ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం అని చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్న మంజుల, శ్రీను వైట్లకు కంగ్రాట్యులేషన్స్ చెప్పింది. ఎందుకంటే శ్రీను వైట్ల ను మహేష్ బాబు దగ్గరకు తీసుకు వెళ్ళింది ఆమె. ఆ తర్వాత శ్రీను వైట్ల, మహేష్ బాబు తో సినిమా అంటే డిఫరెంట్ గా ఉండాలి, అనుకొని చాలా జోనల్ లను అనుకున్నాడు.  కాకపోతే 'ఖలేజా' సినిమా విడుదల చాలా లేట్ అవ్వడంతో, ప్రయోగాలు ఎందుకులే ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అనుకున్నాడు. దానితో శ్రీను వైట్ల, గోపీ మోహన్  కూర్చుని ఒక కథను రెడీ చేశారు. ఆ కథ  క్లైమాక్స్ తప్ప మొత్తం పూర్తయింది.  క్లైమాక్స్ మాత్రం ఎంతకూ నచ్చడం లేదు. శ్రీను వైట్ల ,మహేష్ బాబు కు ఈ క్లైమాక్స్ సెట్ కాదు అనే ఉద్దేశంతో ఆ కథను పక్కన పెట్టేశాడు. దీంతో అంతా షాక్, ఇంత కష్టపడి పూర్తి చేసిన కథ పక్కన పడేసాడు అనుకున్నారు .


ఇంకో కథ కోసం శ్రీను వైట్ల కు ఒక ఐడియా వచ్చింది. వైట్ అండ్ వైట్ ఎమ్మెల్యే పాత్రలో మహేష్ బాబు చూపిస్తే ఎలా ఉంటుంది. ఇప్పటివరకు మహేష్ బాబు ఎప్పుడు కూడా టచ్ చేయని పాత్ర. ఐడియా తో రెండు నెలల్లో కథ మొత్తం పూర్తి చేశారు. డైలాగ్ వర్షన్ కోసం కోన వెంకట్ కూడా పనిచేశారు. కథ సూపర్ గా వచ్చింది. మహేష్ బాబు కు కనిపిస్తే అదిరిపోయింది అంటూ చెప్పాడు. ఆ తర్వాత  సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు, తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. షూటింగ్ ప్రారంభం అయింది. ఏ ఆటంకం లేకుండా చకచకా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 23 సెప్టెంబర్ 2011 విడుదలయింది. విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా మహేష్ బాబు, శ్రీను వైట్ల కెరీర్ లో 'దూకుడు' సినిమా ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: