సినిమా ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్ల‌కే తొలి ప్రాధాన్యం. సినిమా బాగున్నా, బాగుండ‌క‌పోయినా ముందు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చేవి సెంటిమెం ట్లే! సాధార‌ణంగా వీటికి దూరంగా ఉండే డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల. అయినా సినిమావాళ్ల‌కు ఉండే కామ‌నాలిటీస్ ప్ర‌కారం చూసినా శేఖ‌ర్ ఈ సారి స‌క్సెస్ సాధించారు. ఆయ‌న డైరెక్ష‌న్లో న‌టించిన అక్కినేని కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోలు సుమంత్, నాగ చైత‌న్య  మంచి పేరు తెచ్చుకున్నారు. నాగ్ సైతం ఈ విష‌య‌మై ఆనందంగా ఉన్నాడు. ఇదే సంగ‌తి నిన్న‌టి స‌క్సెస్ మీట్ లో చెప్పాడు.




గోదావ‌రి సినిమా తీశాడు శేఖ‌ర్ .. బాపు గారి అభినంద‌న‌లు అందుకున్నాడు శేఖ‌ర్. అవును! మేం తీసిన అందాల రాముడు క‌న్నా ఈ సినిమా బాగుంది అని కూడా అన్నార‌ని విన్నాను. ఈ సారి శేఖ‌ర్ అదే అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నాగ చైత‌న్య ను హీరోగా తీసుకున్నాడు. అప్పుడు సుమంత్ ఇప్పుడు నాగ చైత‌న్య. ఇద్ద‌రూ ఒకే కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోలే అయినా ఎవ‌రి శైలి వారిదే. అస్స‌ల‌స్స‌లు ఒక‌రితో ఒక‌రికి పోలిక‌లే ఉండ‌వు గాక ఉండ‌వు. కొన్ని సెన్సిబుల్ స్టోరీస్ కు సుమంత్ న‌ప్పుతారు. అదే విధంగా ఇంకొన్ని క‌థ‌ల‌కు నాగ చైత‌న్య న‌ప్పుతాడు.



ఏ  మాట‌కు ఆ మాట గోదావ‌రి పై ఉన్న ప్రేమంతా ఆ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో తెలంగాణ నేల‌పై ఉండే ప్రేమ అంతా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని తెర‌కెక‌క్కించ‌డంలో ఇప్ప‌టికే ఆయ‌న విజ‌య‌వంతం అయ్యారు. ముఖ్యంగా అక్క‌డి డైలాగ్, డైలెక్ట్ ఇవ‌న్నీ బాగా ప‌ట్టుకున్నారు ఆయ‌న. అవును! త‌న‌కు బాగా తెలిసిన యాస, తాను చూపించాల‌నుకున్న క‌థ‌కు నేప‌థ్యం ఇవ‌న్నీ ల‌వ్ స్టోరీ సినిమాకు కుదిరాయి. ఇంకొన్ని సెన్సిబులిటీస్ ను బాగా ఎలివేట్ చేసేందుకు ఆస్కారం ఉన్న సినిమానే  కానీ ఎందుక‌నో శేఖ‌ర్ చూపించ‌లేక‌పోయారు. ప్ర‌భావ‌వంతం అయిన క‌థ ఇది. ప్ర‌తిభ‌కూ, బాధ్య‌త‌కూ ప్రాధాన్యం ఉన్న క‌థ ఇది. కొన్ని సున్నిత భావోద్వేగాలు ఇంకా బాగా తీయ‌గ‌ల‌రు ఆయ‌న. ఎందుక‌నో వ‌దిలేశారు. వీటిపై దృష్టి సారిస్తే ఈ సినిమా ఇంకా పెద్ద విజ‌యం అందుకునేది.



మరింత సమాచారం తెలుసుకోండి: