తెలుగు కుటుంబాలకు ఎంతో దగ్గరై అనుబంధాన్ని పెనవేసుకున్న నాగ చైతన్య-సమంత ల  జంట నేడు మేము వ్యక్తిగత కారణాల వలన విడిపోతున్నాం అన్న ఒక్క మాటతో వారి దాంపత్య జీవితానికి స్వస్తి పలికినట్లు వీరు ప్రకటించిన వార్త తెలుగు ప్రజల గుండెల్లో గునపాలు దింపింది. కొద్ది రోజులుగా వీరి విడాకుల అంశం గురించి మీడియా కోడై కూస్తున్నా అభిమానులు మాత్రం అటువంటిదేమీ అయి ఉండదని, ఏదో వీరి మధ్య చిన్న మనస్పర్ధలు కారణంగా ఇలా వార్తలు పుట్టుకొచ్చుంటాయే తప్ప త్వరలో అవి తొలగిపోయి మళ్ళీ ఒకటిగా జీవిత ప్రయాణం కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా అక్టోబర్ 2 న వీరు విడాకులు తీసుకోబోతున్నది నిజమేనంటూ అటు సమంత నాగచైతన్య ఇరువురు సోషల్ మీడియాలో పేర్కొనడం అభిమానులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది.  కానీ నిజాన్ని స్వీకరించక తప్పదు పదేళ్ల వీరి ప్రేమకు తెరపడింది. ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఉత్తమమైన జంటగా మన్ననలు పొందిన వీరు నేడు ఎవరి దారి వారు అంటూ విడిపోవడం అందరినీ నిరాశకు గురిచేసింది. వీరి జంట స్క్రీన్ పై కనిపిస్తుంది అంటే ఎదో తెలియని అనుభూతి..అంతగా ఈ కపుల్ మ్యాజిక్ చేసి ప్రేక్షకులను మైమరిపిస్తారు. 

వీరి ప్రేమను వెండి తెరపై చూడటం ఒక అధ్బుతంగా అనిపిస్తుంది..అలాంటిది ఇకపై ఈ జంట స్క్రీన్ పై కనిపిస్తుందా అంటే అది ప్రశ్నార్ధకమే...నిజానికి అంత ఈజీగా జరిగే పని కాదు.  ఇప్పటి వరకు తమని ఎంతగానో అలరించిన ఈ ప్రేమజంట విడాకులు అనంతరం ఇకపై వెండితెరపై కనిపిస్తుందో లేదో అన్న అనుమానం అందరిలోనూ మొదలయ్యింది. వాస్తవానికి వారిలో మదిలో ఒక దిగులు ఏర్పడింది.  "ఏం మాయ చేసావే" చిత్రంతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం నేటితో ముగిసింది అంటే గుండెలు పగిలి పోతున్నాయి. ఒప్పుకోవడానికి మనసు అంగీకరించడం లేదు. కానీ వాస్తవాన్ని ఎవరు మార్చలేరు కదా. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే మూవీ సమంత నాగ చైతన్య కలసి నటించిన మొదటి చిత్రం అలాగే వీరి కెరియర్ ను సక్సెస్ వైపుకు పరుగులు పెట్టించిన చిత్రం కూడా ఇదే. ఆ తర్వాత వీరిద్దరూ  వెనుతిరిగి చూసింది లేదు. వీరి సక్సెస్, ప్రేమ అన్ని ఇక్కడే మొదలయ్యాయి.  ఈ మూవీ 2010 ఫిబ్రవరి, 26న విడుదలై ప్రేక్షకులను ప్రేమతో మాయ చేసింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం మనం. అక్కినేని కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ సందడి సందడి చేసింది.

సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నాగచైతన్య సమంత కలిసి నటించిన మూడో చిత్రం ఆటోనగర్ సూర్య.  అనంతరం చైతు సామ్ లు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లి తర్వాత మొదటిసారిగా నటించిన చిత్రం మజిలీ. ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం అక్కినేని అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఇక సమత నటించిన ఓ బేబీ చిత్రంలో నాగ చైతన్య అతిథి పాత్రలో కనిపించి సందడి చేశారు. అలా ఇది వీరు కలసి నటించిన ఐదో చిత్రంగా నిలిచింది.  అలా ఈ సూపర్ హిట్ జంట ఐదు చిత్రాల్లో కలసి నటించి కనువిందు చేయగా ఇకపై తెలుగు ప్రేక్షకులకు ఆ  అదృష్టం ఉందో లేదో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కానీ వీరు మేము విడిపోయాం. కానీ మా మధ్య స్నేహం బంధం అలాగే కొనసాగుతుంది అన్న ఒక్క మాట కాస్త ఊరటనిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: