చాలా కాలం నుంచి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం కష్టపడుతున్న ఎన్టీఆర్సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది.

ఆ తర్వాత వెకేషన్ కి వెళ్దాం అనుకుంటున్నా సరే ఎవరు మీరు కోటీశ్వరులు కారణంగా ఆయన బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది.ఇప్పుడు అది కూడా పూర్తి కావడంతో ఆయన లాంగ్ వెకేషన్ కు వెళ్లిపోతున్నారని సమాచారం.ఆ వివరాల్లోకి వెళితే.

అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారని తెలుస్తుంది.. అయితే ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి అనుకున్నా సరే కారణంగా సినిమా వాయిదా పడుతూ వెళ్ళిందని చివరికి చాలా లేటుగా ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది.

అయితే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత సినిమా సినిమాకి గ్యాప్ తీసుకుని కాస్త వెకేషన్ కి వెళ్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు వెకేషన్ కి వెళ్లాల్సిన సమయం దగ్గర పడిందని తెలుస్తుంది.మామూలుగా అయితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అయిన వెంటనే ఆయన వెకేషన్ కు వెళ్లాల్సి ఉంది కానీ ఎవరు మీరు కోటీశ్వరులు అనే ఒక గేమ్ షో కూడా ఆయన చేస్తున్న కారణంగా ఆయన వెకేషన్ కి వెళ్ళ లేకపోయారని తెలుస్తుంది.


ఈ షో షూటింగ్ కూడా ఈ మధ్యనే పూర్తయిందని ఇక కొరటాల శివ సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం ఉండటంతో ఆయన వెకేషన్ కు వెళ్లాలని అనుకుంటున్నట్లు సమాచారం.. కొరటాల శివ సినిమా డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటే దాదాపు నెలన్నర పైగా ఇప్పుడు ఎన్టీఆర్ ఖాళీగా ఉంటారని తెలుస్తుంది.


ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ ని తీసుకొని విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.. తన భార్య ఇద్దరు కుమారులు తీసుకుని ఆయన మాల్దీవ్స్ వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండని తెలుస్తుంది. కానీ మాల్దీవ్స్ రొటీన్ అయిపోయాయి కాబట్టి వేరే దేశానికి వెళ్లే అవకాశం ఉందని కూడా ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారని తెలుస్తుంది.. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30వ సినిమా లో హీరోయిన్ గా అలియా భట్ ను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోందని తెలుస్తుంది.
 


అయితే దీని మీద ఇంకా అలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని మరో ప్రచారం కూడా ఉందని తెలుస్తుంది.అలావుంచితే సినిమా షూటింగ్ అయితే ఇక్కడ జరగదని అధిక భాగం ఈజిప్ట్ లో జరిగే అవకాశం ఉందని అంటున్నట్లు సమాచారం.. సుమారు 42 రోజుల లాంగ్ షెడ్యూల్ ఈజిప్ట్ లో జరిగే అవకాశం ఉందని సమాచారం.అయితే ఇంకా ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారని వార్త వినిపిస్తుంది.ఆయన పూర్తిగా ఖాళీ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈజిప్టు బయలు దేరి వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని సమాచారం.మొత్తం మీద ఎన్టీఆర్ లాంగ్ బ్రేక్ మాత్రం ఆసక్తికరంగా మారిందని ఎవరు మీరు కోటీశ్వరులు రెండో సీజన్ చేయకపోవచ్చని అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: