పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2వ తేదీ. పవర్ స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన కొత్త సినిమా భీమ్లా నాయక్ లోని ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ టైటిల్ సాంగ్ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. పోలీస్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ఎలాంటి బిహేవియర్ తో ఉంటాడో ఈ పాటను బట్టే అర్థమవుతుంది. అంతా బాగుంది కానీ.. ఆ సాంగ్ పై ఓ ఐపీఎస్ అధికారి పెదవి విరిచారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పాటలోని సాహిత్యాన్ని తప్పుబట్టేశారు. తాము ప్రజల బొక్కలు విరగ్గొట్టమని చెప్పారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ తమ విధానమని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ కోసం జీతాలు తీసుకుంటున్న తాము ఇలా బిహేవ్ చేసేది లేదన్నారు.

ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రిపై కూడా విమర్శలు సంధించారు. పోలీస్ పాత్రను అభివర్ణించేందుకు మన తెలుగులో ఇంతకంటే గొప్ప పదాలు దొరకలేదా అని ప్రశ్నించారు. ఆశ్చర్యమేస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ ఐపీఎస్ అధికారి. పోలీసులు ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ కష్టపడుతుంటే.. వారి సేవల గురించి ప్రస్తావించలేదన్నారు. కొందరు నెటిజన్లు అయితే.. పాట సాహిత్యం మరీ అంత ఆకట్టుకునే విధంగా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇంకొందరైతే రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి తగిన విధంగా సాంగ్ లేదని నెటిజన్లు తమ మనసులో ని మాటను భయటపెట్టారు. దీనికి స్పందించిన రామజోగయ్య శాస్త్రి.. ఈ సారి బాగా రాస్తా తమ్ముడూ.. ప్లీజ్ అని సమాధానమిచ్చాడు.
భీమ్లా నాయక్ తొలిపాటను తెలంగాణ జానపద కళాకారుడు.. మొగులయ్య పాడారు. ఆయన కిన్నెరను వాయించే విధానం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ‘భీం భీం భీం భీం భీమ్లానాయక్’ అని సాగే ఈ పాటకు థమన్ ట్యూన్ కంపోజ్ చేశారు. మొగులయ్య తొలుత పాడిన తర్వాత థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల నలుగురూ ఆ పాటను కంటిన్యూ చేస్తారు. అయితే ఈ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుండటం విశేషం.








మరింత సమాచారం తెలుసుకోండి: