టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకు షూటింగ్ స్టార్ట్ అయి అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే... మహేష్ బాబుతో ఒక్కడు సినిమాను తెరకెక్కించి మంచి విజయం అందుకున్న గుణశేఖర్ ఆ తర్వాత అర్జున్ సినిమా చేశాడు. అయితే ఆ సినిమా తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో సైన్యం అనే సినిమాను తీయడానికి ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ప్లాన్ చేశారు.

 పోకిరి సినిమా కన్నా ఈ ప్రాజెక్ట్ ముందే చేయాల్సి ఉంది. అయితే ఈలోగా పోకిరి సినిమా పూర్తి అయి ఇండ్రస్ట్రీ హిట్ అందుకోవడంతో దాంతో మహేష్ కెరీర్ మారిపోయింది. దాంతో సైన్యం మూవీ అప్డేట్ కాదన్నా కారణంగా ఆగిపోయింది. దానికి తోడు సైనికుడు మూవీ కూడా డిజాస్టర్ కావడంతో సైన్యం ఆగిపోవడానికి ఒక కారణమైంది. ఇక త్రివిక్రమ్ ఖలేజా సినిమా కారణంగా మిర్చి మూవీ కూడా మహేష్ నుండి చేజారిపోయింది. అదేవిధంగా అల్లు అర్జున్ వరుడు టైటిల్ కూడా మహేష్ బాబు కోసమే ముందు రిజిస్టర్ చేయించారు. కానీ ఎందుకో అది తెరకెక్కలేదు.దానికి ఖలేజా సినిమా కూడా కారణమని చెబుతారు. ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నట్టు ప్రకటన వచ్చినా..

 ఆ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదు. ఇక ఏకంగా 40 కోట్లతో మహేష్ బాబు, కరీనాకపూర్ తో ఓ సినిమాని ప్లాన్ చేశారు. కానీ దూకుడు సినిమా చేయడం వల్ల అది ఆగిపోయింది. ఇక మణిరత్నం డైరెక్షన్లో కూడా ఒక సినిమా ప్రకటన వచ్చి ఆగిపోయింది. మరోవైపు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేయాలనుకున్న జనగణమన మూవీ 2016 నుంచి ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో హరేరామ హరేకృష్ణ అనే సినిమా కూడా అనుకున్నా ఎందుకో అది తెరకెక్కలేదు. ఇక మహర్షి తర్వాత వంశీ పైడిపల్లితో మహేష్ సినిమా చేయాలని అనుకున్నాడు. మహేష్ కి కథ కూడా కనిపించాడు వంశీ పైడిపల్లి. ఈ కథలో కొన్ని మార్పులు చేయమనడంతో ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అంతేకాదు ఇడియట్ గజిని 24 వంటి సినిమాలను కూడా మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: