ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కెరీర్ లో ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్, కొమరం భీం గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ అన్ని కూడా మూవీ పై ఆకాశమే హద్దుగా అందరిలో అంచనాలు ఏర్పరిచాయి.

టాలీవుడ్ బడా నిర్మాత దానయ్య నిర్మించిన ఈ సినిమాలో సముద్రఖని, శ్రియ, అజయ్ దేవగన్, రాజీవ్ కనకాల తదితరులు ఇతర పాత్రలు చేయగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక జనవరి 7న వరల్డ్ వైడ్ గా ఎంతో భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ మూవీ తప్పకుండా సూపర్ సక్సెస్ కొట్టడం ఖాయం అని అటు యూనిట్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే విషయం ఏమిటంటే, నిజానికి 1920ల కాలం నాటి కథగా స్వాతంత్రోద్యమ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా కథ అల్లూరి, భీం ల జీవితం పై సాగుతుందని అందరూ భావిస్తుండగా, ఇటీవల రాజమౌళి మీడియా ఇంటర్వ్యూ ల్లో భాగంగా చెప్పిన మాటలను బట్టి, మూవీలో కేవలం భీం, అల్లూరి ల పాత్రని మాత్రమే తీసుకున్నాం అని, ఇక సినిమాలో కనిపించే కథ మొత్తం కూడా ఫిక్షన్ అంశాలతో చిత్రీకరించిందే తప్ప వారి చరిత్ర నుండి ఒక్క పాయింట్ ని కూడా తీసుకోవడం జరుగలేదని అన్నారు. ముఖ్యంగా ఒకానొక సమయంలో తమ తమ కుటుంబాలకు దూరంగా అటు భీం, ఇటు అల్లూరి కొన్నాళ్ల పాటు దూరంగా బయటకు వెళ్లి జీవించారని, అయితే ఆ సమయంలో ఒకవేళ వారిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పర్చిన ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: