ఒక్క పాట ఒక్కే ఒక్క పాట టోటల్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మూడు సంవత్సరాల నుండి సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, మరెందరో టెక్నిషియన్స్ ఎంతో కష్టపడి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి తెరకెక్కించిన సినిమా "పుష్ప". ఈ సినిమాని ఎప్పుడెప్పుడు ధియేటర్స్ లో చూద్దామా అని కోట్లాది మంది అభిమానులు..మరెందరో సెలబ్రిటిలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ని ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంతే సమానంగా వివాదాలు కూడా తెచ్చుకుంది. సౌత్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ వ్యూవ్స్ దక్కించుకున్న సాంగ్ గా రికార్డులు సృష్టించిన ఈ పాట పై  బయట ఎంత పెద్ద గొడవ జరుగుతుందో మనకు తెలిసిందే. ఈ పాటలో.."మగాళ్ల బుద్ధి వంకర బుద్ధి" అంటూ వచ్చే లిరిక్స్ మగాళ్లను కించపరిచే విధంగా ఉన్నాయంటూ కొందరు మగాళ్లు ఈ పాట పై అసహనం వ్యక్తం చేస్తూ..ఈ పాటను అసలు చంద్రబోస్ ఎలా రాస్తాడు అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఈ పాటను సినిమాలో నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఈ వివాదాలు ఏమాత్రం పట్టించుకోని మంగ్లీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ "ఊ అంటావా మావా..ఊ ఊ అంటావా మావా" అనే సాంగ్ పాడింది ఇంద్రావతి చౌహాన్..ఈమె ఫోక్ సింగర్ మంగ్లీకి చెల్లెలు అవుతుంది. నిజానికి ఈ పాటకు మెయిన్ ప్లస్ సింగర్ గొంతు . ఆమె మత్తెక్కించే గొంతుతో పాడిన ఈ పాట అందరిని ఆకట్టుకుంది. దీంతో చెల్లి పాడిన పాట ఇంతటి విజయం సాధించడంతో మంగ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. "ఈ పాట  నాలుగు రోజుల్లోనే 3 కోట్ల వ్యూస్‌ను రాబట్టి పెద్ద విజయం సాధించడం హ్యాపీ గా ఉంది. కంగ్రాట్స్‌ ఇంద్రావతి చౌహన్‌. ఈ పాట పాడే అవకాశానీ ఇచ్చినందుకు దేవీ శ్రీ ప్రసాద్‌, సుకుమార్‌ సర్‌, అల‍్లు అర్జున్‌ సర్‌, చంద్రబోస్‌ అన్న  అందరికీ థ్యాంక్యూ.' అంటూ మంగ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: