వరస ఫ్లాపులతో ప్రేక్షకులను భారీగా నిరాశపరిచిన మెహర్ రమేష్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా హీరోల నమ్మకాన్ని కూడా కోల్పోయాడు. దర్శకుడు గా కూడా మెహర్ రమేష్ కు చెడ్డ పేరు తీసుకు వచ్చాయి సదరు సినిమాలు. ఏ దర్శకుడైనా హిట్ కొట్టాలనే సినిమాను మొదలు పెడతారు కానీ మెహర్ రమేష్ ఫ్లాప్ చేయడం లో రికార్డులు సృష్టించాలని సినిమా లు చేసినట్లు కనిపిస్తుంది. ఈ విధంగా పెద్ద హీరోల తో సినిమాలు చేసి భారీ ఫ్లాపులు అందుకున్నాడు. 

దాంతో మెహర్ సినిమా అంటే ఫ్లాప్ అనే విధమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండటంతోనే మెహర్ రమేష్ అంటే ప్రతి ఒక్కరూ ఎంతో భయపడిపోయారు. ఆయనతో సినిమా అంటే హీరోలు చాలా దూరం వెళ్ళిపోయేవారు. దాంతో పదేళ్లకు పైగానే మెహర్ రమేష్ ఖాళీగా ఉండవలసి వచ్చింది. ఆయన దర్శకత్వం వహించిన షాడో చిత్రం తర్వాత ఏ సినిమాకు ఆయన పని చేయలేదు. మెహర్ రమేష్ పది సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు ఓ బంపరాఫర్ కొట్టేశారు.

అదే మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడం. మెగా అభిమానులు ఈ దర్శకుడితో చిరంజీవి సినిమా చేయడం పట్ల కొంత కలవరపడ్డ కూడా ఆ తర్వాత మెహర్ రమేష్ పై నమ్మకం కలిగింది వారికి తప్పకుండా ఈ సినిమా హిట్ అవ్వాలి అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు. అలా మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దుతున్నట్లు తెలుస్తుంది.  ఈ సినిమా లో చిరంజీవి గెటప్ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మెగా అభిమానుల సానుభూతిని పొందాడు మెహర్. మొదట్లో ఈ సినిమాలో చిరంజీవి గుండు లుక్ తో కనిపిస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ గుండు లుక్ కాకుండా వేరే లుక్ ఫైనల్ చేయడంతో చిరంజీవిని గుండు లో చూడడానికి ఇష్టపడని వారు ఎంతో సంతోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: