సాధారణంగా విజయం సాధించడం అనేది ఒక గొప్ప విషయం.. అలాంటిది మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడం కోసం చాలా మంది యువ హీరోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ2021 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు మొట్టమొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారో వారి గురించి మనం తెలుసుకుందాం.

1. వైష్ణవ తేజ్:మెగా మేనల్లుడు..మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక బుల్లి హీరో ఇతను.. సాయిధరమ్ తేజ తమ్ముడుగా.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా తో సంచలనం సృష్టించాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన.ఈ  సినిమా ఏకంగా రూ.51 కోట్ల షేర్ని వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డు గా నిలిచింది.

2. రోషన్ మేక:ప్రముఖ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ తాజాగా విలన్ గా  అవతారమెత్తనున్న విషయం తెలిసిందే. ఇక ఈయన కొడుకు రోషన్ ఈ సంవత్సరం పెళ్లి సందడి సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నాడు . ఇకపోతే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

3. ప్రదీప్ మాచిరాజు:యాంకర్ గా బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రదీప్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను తీసుకొచ్చింది.

4. తేజ సజ్జ:గత 24 సంవత్సరాలుగా బాలనటుడుగా సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న ఈయన.. రెండేళ్ల కిందట ఓ బేబీ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేశాడు. అయితే ఈ సంవత్సరం ఈ సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ తర్వాత ఇష్క్, అద్భుతం సినిమాలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

5. కమెడియన్ సత్య:
ఇక ఎప్పుడూ  హీరోల గ్రూపులో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సత్య.. ఈసారి వివాహ భోజనంబు అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను మరో హీరో సందీప్ కిషన్ నిర్మించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: