సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమందికి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ వచ్చేస్తూ ఉంటుంది. దీంతో వరుస అవకాశాలు వచ్చి బిజీ బిజీగా గడుపుతు ఉంటారు. అయితే ఇలా స్టార్ హీరోయిన్ గా బిజీ షెడ్యూల్లో ఉన్న సమయంలో కొన్నిసార్లు డేట్స్ కుదరక డబ్బింగ్ కి దూరంగా ఉండడంతో.. ఇక డబ్బింగ్ ఆర్టిస్టులతో  ఆయా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం  సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ డబ్బింగ్ చెప్పడం మాత్రం ఆనందాన్నిస్తుంది అంటూ చెప్పింది. అయితే ఈమె ఇప్పటి హీరోయిన్  కాదు ఒకప్పుడు నటనతో తన గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ సరిత.


 కె.బాలచందర్ ఎంతో మంది హీరోయిన్లను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. వారిలో సరిత కూడా ఒకరు. విలక్షణ నటుడు కమల్ హీరోగా బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో చరిత్ర సినిమాలో సరిత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో  సరితకు ఒక్కసారిగా స్టార్డం వచ్చేసింది. వరుస అవకాశాలు వచ్చి ముంగిట వాలాయ్. ఈక్రమంలోనే సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే  హీరోయిన్ సరిత షాకింగ్ నిర్ణయం తీసుకుందట.  డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవతారమెత్తింది


 ఇతర హీరోయిన్లకు గాత్ర దానం చేయడం మొదలుపెట్టింది. ఇక తాను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎలా మారాను అన్న విషయాన్ని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సరిత. దాసరి నారాయణరావు తెరకెక్కించిన గోరింటాకు సినిమాలో హీరోయిన్ సుజాత కు డబ్బింగ్ చెప్పడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలైంది అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మెళుకువలు నేర్చుకోవడంతో డబ్బింగ్ చెప్పడం ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది అంటూ సరిత తెలిపింది. ఇక మూడు షిఫ్టుల్లో  సినిమా షూటింగులు ఉన్నప్పటికీ నైట్ షిప్టులో కష్టపడి మరీ డబ్బింగ్ చెప్పడానికి ఇష్ట పడేదాన్ని అంటూ సరిత తెలిపింది. తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పానని తెలిపింది సరిత. ఇలా ఎంతోమంది  హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు గా మారడానికి హరిత గాత్రదానమే  కారణం అని కూడా అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: