శృతిహాసన్.. నవరసాలను క్షణాల్లో పండించగల విశ్వనటుడు కమల హాసన్ కూతురే ఈ శృతి హాసన్. శృతిహాసన్.. కమల్ హాసన్ సారికతో  పెళ్లి చేసుకోకుండా డేటింగ్లో ఉన్నప్పుడే 1986 జనవరి 28 న శృతిహాసన్ జన్మించింది .ఇక ఈమె జన్మించిన రెండు సంవత్సరాల తర్వాత కమల్ హాసన్.. సారిక ను రెండవ వివాహం చేసుకున్నారు. శృతిహాసన్ కు  చారుహాసన్ అనే ఒక అందమైన చెల్లెలు కూడా ఉంది. శృతిహాసన్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సిద్ధార్థ హీరోగా నటించిన అనగనగా ఒక ధీరుడు అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోలేక పోయినా శృతిహాసన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించి అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఇకపోతే సినిమాల ద్వారా ఎంత సంపాదించింది అనే విషయాన్ని ఆమె అభిమానులు తెలుసుకోవడానికి కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే శృతిహాసన్ లగ్జరీ లైఫ్ గురించి ఆమె లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శృతిహాసన్ పూర్తి పేరు శృతి రాజలక్ష్మి హాసన్. ఇంట్లో అందరూ ముద్దుగా కన్నా, శృతి  అని పిలుచుకుంటూ ఉంటారు. విద్యాభ్యాసం విషయానికొస్తే డిగ్రీలో సైకాలజీ పట్టా అందుకుంది. ఈమెకు మోడల్ కార్స్ అంటే చాలా ఇష్టమట.. ఈ నేపథ్యంలోనే రేంజ్ రోవర్ అవోక్ అనే  కారును కొనుగోలు చేసింది.. ఈ కారు ధర చూస్తే రూ.71.40 లక్షలు.. ఆడి క్యూ సెవెన్ ధర రూ.69.50 లక్షలు. టయోటా ఫార్చునర్..దీని ధర రూ.26.60 లక్షలు. జాక్వర్ ఎక్స్ ఈ..దీని ధర రూ.46.50 లక్షలు. ఈమెకి ఉన్న ఇంటి విషయానికి వస్తే.. టీ టీ కే రోడ్ అల్వార్పెట్ , చెన్నై లో అత్యంత విలాసమైన ఇల్లు ఈమె సొంతం. ఇక ఈ ఇంటి ధర విషయానికి వస్తే.. అక్షరాలా రూ.9 కోట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: