సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సీనియర్ స్టార్ హీరోయిన్లు యువ హీరోలతో జత కడుతున్నారు. నాలుగు పదుల వయస్సుకు దగ్గరగా ఉన్న హీరోలు.. కుర్ర హీరోయిన్లతో సినిమాలు చేస్తుంటే, స్టార్డమ్ అందుకొని సీనియర్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న మరికొంతమంది చిన్న హీరోలతో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకీ చిన్న హీరోలతో సందడి చేస్తున్న ఆ సీనియర్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం...!

అనుష్క శెట్టి

స్టార్ హీరోలు, సీనియర్ హీరోల పక్కన ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అందాల తారకి రీసెంట్ గానే 40 ఏళ్లు వచ్చాయి. ఇక బాహుబలి తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన అనుష్క 2021లో మాత్రం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. 2022 లో మాత్రం ఓ కుర్ర హీరోలతో జోడీ కడుతోంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఓ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో జతకడుతుంది అనుష్క. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది..

సమంత

విడాకుల తర్వాత సమంత సినిమాల విషయంలో దూకుడు కనబరుస్తోంది. 2022 సంవత్సరంలో సమంత తన హవాని గట్టిగానే చూపించబోతోంది. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమాలో తన కంటే స్టార్ డం తక్కువ ఉన్న మలయాళం హీరో దేవ్ మోహన్ తో నటించగా.. ఇప్పుడు యశోద సినిమాలో కూడా ఉన్ని ముకుందన్ సరసన కనిపించనుంది. గతంలో ఓ బేబీ సినిమాలో యంగ్ హీరో నాగ శౌర్య కి జోడిగా కూడా నటించింది సమంత..

దీపికా పదుకునే

ఇక బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. యంగ్ హీరో సిద్ధార్థ చతుర్వేది తో ఈ మధ్య కనిపించింది దీపికా పదుకొనే. బీచ్ దగ్గర కూర్చున్న వీరి ఫోటోలు నెట్ లో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ న్యూ మూవీ గెహ్రయ్యాన్ లో తన కంటే చిన్నవాడైన సిద్ధార్థ చతుర్వేది తో రొమాన్స్ చేయనుంది దీపికా.

కత్రినాకైఫ్

ఇటీవల తన కంటే ఐదేళ్ళు చిన్నవాడైన విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్న కత్రినాకైఫ్ తనకంటే స్టార్ డం లో పోటీ పడలేని కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి జతకడుతోంది. మేరీ క్రిస్మస్ అనే బాలీవుడ్ ప్రాజెక్టులో వీరిద్దరు జంటగా నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: